Kejriwal: మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో (Delhi liquor scam) ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Kejriwal) ను అరెస్టు చేయడం రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ (Priyanka Gnadhi)అన్నారు. లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడిందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ప్రియాంక ట్విటర్ వేదికగా స్పందించారు. ఆమె తన ఎక్స్ ఖాతాలో ఇలా రాసుకొచ్చారు. “ఎన్నికల యుద్ధరంగంలో మీరు మీ విమర్శకులతో పోరాడండి, వారిని ధైర్యంగా ఎదుర్కోండి, వారి విధానాలు, పని తీరుపై దాడి చేయండి - ఇది ప్రజాస్వామ్యం. కానీ ఈ విధంగా దేశంలోని అన్ని సంస్థల అధికారాన్ని తన రాజకీయ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించుకోవడం, ఒత్తిడి చేయడం ద్వారా వాటిని నిర్వీర్యం చేయడం ప్రజాస్వామ్యంలోని ప్రతి సూత్రానికి విరుద్ధం'' అని పేర్కొన్నారు.
ప్రియాంక గాంధీ ఏం చెప్పారు?
దేశంలోనే అతిపెద్ద ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలు స్తంభించాయని ప్రియాంక గాంధీ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలపైనా, వాటి నేతలపైనా ఈడీ, సీబీఐ, ఐటీల నుంచి రాత్రి పగలు తేడా లేకుండా దాడులు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిని జైల్లో పెట్టారు. ఇప్పుడు రెండో ముఖ్యమంత్రిని కూడా జైలుకు తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భారతదేశ స్వతంత్ర చరిత్రలో ఇలాంటి అవమానకరమైన దృశ్యం మొదటిసారిగా కనిపిస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ED ఏమి డిమాండ్ చేస్తుంది?
ఇదిలా ఉండగా, అరెస్టయిన ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్‌ను శుక్రవారం (మార్చి 22, 2024) మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) ప్రత్యేక కోర్టులో హాజరుపరచనున్నట్లు అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ పిటిఐ పేర్కొంది. అతడిని విచారించేందుకు ఈడీ కస్టడీని కోరనుంది.
Also read: ‘అవినీతికి వ్యతిరేకంగా భారతదేశం’ అన్న వ్యక్తే అవినీతి కేసులో అరెస్ట్ !