National: అమ్మ స్థానంలో కూతురు..రాహుల్ మాత్రం మళ్ళీ అక్కడి నుంచే..

లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అన్ని పార్టీల నేతలూ పోటీకి సిద్ధమవుతున్నారు. ఎక్కడ నుంచి పోటీ చేయాలా అని లెక్కలు వేసుకుంటున్నారు. కాంగ్రెస్ ముఖ్య నేతలూ తాము పోటీ చేసే స్థానాల కోసం కసరత్తులు మొదలుపెట్టారు.

Rahul Gandhi Birthday  : వరుస ఫెయిల్యూర్స్ నుంచి సక్సెస్ ఫుల్ పొలిటీషియన్ గా.. రాహుల్ గాంధీ ఎదుర్కొన్న ఎదురు దెబ్బలివే!
New Update

Rahul, Priyanka Gandhi: లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈసారి ఎన్నికల్లో అగ్రనేత ప్రియాంకగాంధీ కూడా సిద్ధమవుతున్నారు. మొదటిసారి ఆమె ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీపడుతున్నారు. అది కూడా తన తల్లి సోనియాగాంధీ నియోజకవర్గం రాయబరేలీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ స్థానం నుంచి మాజీ ప్రధాని ఇందిరా గాంధీ మూడుసార్లు విజయం సాధించారు. తర్వాత సోనియా సైతం ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఎన్నికయ్యారు. ఈసారి ఎన్నికల్లో సోనియాగాంధీ పోటీ చేయకపోవడంతో ఆ స్థానంలో ప్రియాంక దిగుతున్నారు. ఇక రాహుల్ మాత్రం మళ్ళీ అమేధీ నుంచే పోటీకి సమాయత్తమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మళ్ళీ అమేధీ నుంచే..

గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు చోట్ల నుంచి పోటీ చేశారు. అమేధీ నుంచి, కేరళలోని వాయనాడ్‌ నుంచి. ఇందులో వాయనాడ్‌లో గెలిచిన అమేధీలో మాత్రం బీజేపీ నేత స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయారు. కానీ మళ్ళీ రాహుల్ గాంధీ అమేధీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారుట.

ప్రియాంక మొదటిసారి..

ఇక ప్రియాంకగాంధీ ఎన్నికల్లో పోటీ గురించి అందరూ తెగ చర్చించుకుంటున్నారు. రాయబరేలీలో కాంగ్రెస్ నేతలు ఎప్పుడూ ఓడిపోలేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యూపీలో కేవలం రాయబరేలీలోనే విజయం సాధించింది. అందుకే ఇప్పుడు సోనియా గాంధీ పోటీలో ఉన్న ఆ స్థానం నుంచి ఇప్పుడు ప్రియాంకను దింపాలని కాంగ్రెస్ అధిష్ఠానం అనుకుంటోందని తెలుస్తోంది. ప్రస్తుతం సోనియా గాంధీ రాజ్యసభకు నామినేట్ కావడంతో ఆమె స్థానంలో కుమార్తె ప్రియాంక‌కు టిక్కెట్ కేటాయించే ఆలోచనలో ఉన్నారు.

Also Read:Movies: దేవరలో జాన్వీ క్యూట్ లుక్..బర్త్‌డే గిఫ్ట్

#congress #priyanka-gandhi #india #rahul-gandi #raybareli #amethi
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe