Priyanka Chopra : షూటింగ్‌ లో గాయపడిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

ప్రియాంక చోప్రాకు షూటింగ్‌ లో గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్‌ మీడియా ద్వారా వెల్లడించింది.హాలీవుడ్‌ సినిమా బ్లఫ్‌ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆమెకు మెడకు గాయాలు అయినట్లు సమాచారం.గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక ఇన్‌ స్టా ద్వారా తెలిపింది.

New Update
Priyanka Chopra : షూటింగ్‌ లో గాయపడిన బాలీవుడ్‌ ముద్దుగుమ్మ!

Bollywood : బాలీవుడ్‌ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) గురించి సినీ ప్రపంచానికి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. గ్లోబల్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ వరుసగా హాలీవుడ్‌ (Hollywood) సినిమాలతో పాటు బిజీగా ఉంది. ఒకప్పుడు బాలీవుడ్‌ స్టార్ హీరోల సరసన నటించింది. ప్రియాంక ప్రస్తుతం హాలీవుడ్‌ లో వరుస సినిమాల్లో నటిస్తుంది. సినిమాలతో పాటు మరో పక్క ప్రకటనలు కూడా చేస్తూ బిజీగా ఉంటుంది.

తాజాగా ప్రియాంక చోప్రాకు షూటింగ్‌ లో గాయాలు అయినట్లు తెలుస్తుంది. ఈ విషయాన్ని స్వయంగా తానే సోషల్‌ మీడియా (Social Media) ద్వారా వెల్లడించింది. హాలీవుడ్‌ పాప్‌ సింగర్‌ నికో జోనాస్‌ ను పెళ్లాడి అక్కడే సెటిల్‌ అయిపోయింది. భారత్‌ కు కేవలం షూటింగ్‌ ల కోసం వచ్చి వెళ్తుంది. సినిమాలతో, పర్సనల్ లైఫ్‌ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌ గా ఉంటుంది.

ప్రస్తుతం ప్రియాంక్‌ హాలీవుడ్‌ సినిమా బ్లఫ్‌ చిత్రీకరణలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ప్రియాంకకు మెడకు గాయాలు అయినట్లు సమాచారం. తన గొంతుకు గాయాలైనట్లు ప్రియాంక తన ఇన్‌ స్టా స్టోరీ ద్వారా తెలిపింది. తనకు గాయామైన ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్‌ బాగా వైరల్‌ అవుతుంది.

Also read: తమిళనాడులో ఘోరం..కల్తీసారా తాగి 18 మంది మృతి!

Advertisment
తాజా కథనాలు