Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని పూణె జిల్లా పౌడ్‌ అనే గ్రామం వద్ద ఓ ప్రైవేట్ హెలికాప్టర్‌ కుప్పకూలింది. అందులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యయి. ఈ హెలికాప్టర్ ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తు్ండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

New Update
Watch Video: ఘోర ప్రమాదం.. కుప్పకూలిన హెలికాప్టర్‌.. వీడియో వైరల్

మహారాష్ట్రలోని పూణె జిల్లాలో పౌడ్‌ అనే గ్రామం వద్ద శనివారం హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. గాల్లో ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ అదుపుతప్పి కుప్పకూలింది. దీంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Also Read: జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు.. తెలుగు నేతలకు కీలక బాధ్యతలు

ఓ ప్రైవేట్ ఎవీయేషన్ కంపెనీకి చెందిన ఈ హెలికాప్టర్‌.. ముంబయి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. హెలికాప్టర్‌ నేలకూలేముందు దాని వేగం నియంత్రణలోకి రావడంతో అందులో ప్రయాణిస్తున్నవారు గాయాలతో బయటపడ్డారు. ఒకవేళ అలా జరగకపోయిఉంటే వాళ్లకు ప్రాణాలకు ప్రమాదం ఉండేది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. శనివారం ఉదయం నుంచి పుణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read: రంగనాథ్ హీరో.. జీహెచ్ఎంసీ జీరో..! హైడ్రా దూకుడుతో పోలీసోడికి జనం జేజేలు

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు