Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat) అనర్హత వేటుపై ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు. వినేశ్.. నువ్వు ఛాంపియన్లకే ఛాంపియన్. నీ ప్రతిభ దేశానికి గర్వకారణం అంటూ ఓదార్చే ప్రయత్నం చేశారు. 'వినేశ్ నీవు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకం. ఈ రోజు నీకు తగిలిన ఎదురుదెబ్బ ఎంతో బాధించింది. దీనిని వ్యక్తపరడచడానికి నా దగ్గర మాటల్లేవు. దీని నుంచి నీవు బయటపడి మరింత బలంగా తిరిగొస్తావని నమ్ముతున్నా. నీకు మేమంతా అండగా ఉంటాం' అని ధైర్యాన్ని నింపారు.
అలాగే అనర్హతపై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉషను ఆరాతీశారు మోదీ. వినేశ్ కు సహాయం చేయడానికి పూర్తి స్థాయి ప్రయత్నాలు చేయాలని సూచించాడు. ఆమెపై అనర్హత వేటు వేస్తే తీవ్ర నిరసన వ్యక్తం చేయాలని పిటి ఉషకు తెలిపారు. ఆమె పోటీలో పాల్గొనేందుకు ఉన్న అవకాశాలన్నీ పరిశీలించాలని కోరారు. అలాగే డిహైడ్రేషన్ లో ఆస్పత్రిలో చేరిన ఫోగట్ ఆరోగ్యంపై కూడా మోదీ వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఇక పారిస్ ఒలంపిక్స్‌లో ఫైనల్స్‌లోకి అడుగుపెట్టిన మహిళా రెజ్లర్ వినేష్ ఫొగట్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) అభినందించారు. ‘ఒకే రోజులో ప్రపంచంలోని ముగ్గురు అత్యుత్తమ రెజ్లర్లను ఓడించినందుకు వినేష్‌తో పాటు దేశం మొత్తం ఉద్వేగానికి లోనైంది. వినేష్, ఆమె సహచరుల పోరాటాన్ని తిరస్కరించిన వారందరూ, వారి ఉద్దేశాలు సామర్థ్యంపై ప్రశ్నలు లేవనెత్తారు. ఇది చాంపియన్లకు ఎంతో గర్వకారణం. విమర్శించిన వారికి మైదానంలోనే తగిన సమాధానం ఇచ్చారు. ఆమె రక్తపు కన్నీళ్లు కార్చడానికి కారణమైన అధికార వ్యవస్థ మొత్తం ప్రస్తుతం కుప్ప కూలింది. ప్యారిస్‌లో ఫొగట్ సాధించిన విజయాల ప్రతిధ్వని ఢిల్లీలో స్పష్టంగా వినిపిస్తోంది' అన్నారు రాహుల్ గాంధీ.
Also Read : నటుడు బిత్తిరి సత్తిపై కేసు నమోదు