PM Modi: ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. హైదరాబాద్ లోని 15వ శతాబ్దం నాటి ఈ ప్రఖ్యాత బల్కంపేట ఎల్లమ్మ తల్లి దేవాలయ ప్రాంగణంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వివిధ సౌకర్యాల ప్రాజెక్టును ప్రకటించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా దేవస్థానంలో అన్నదానం భవనం, వర్షపునీటి సంరక్షణ వసతులు, వరదనీటి డ్రైనేజ్ వ్యవస్థ, బయో టాయిలెట్స్ కాంపౌండ్ వాల్స్, గేట్లు, సీసీటీవీలు, సైనేజెస్, డీజీ సెట్ వంటి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. నిత్యం వేలాదిమంది భక్తులు అమ్మవారి ఈ ప్రాచీన ఆలయాన్ని సందర్శిస్తారు. వారందరికీ ఈ కొత్త ప్రాజెక్టు ద్వారా సౌకర్యం కలగనుంది.
ALSO READ: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్‌ఆర్టీసీ
భువనగిరి కోట అభివృద్ధికి రూ.69 కోట్లు..
భువనగిరి కోట అభివృద్ధి కోసం రూ.69 కోట్లను ప్రధాని మోడీ మంజూరు చేశారు. స్వదేశీ దర్శన్ 2.0 స్కీమ్ కింద కేంద్రం నిధులు మంజూరు చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ భువనగిరి కోట అభివృద్ధి పనులు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ పాల్గొన్నారు. రెండ్రోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని ఈ ప్రకటన చేయడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.