TSRTC: ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు భారీ డిస్కౌంట్ ప్రకటించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం రాయితీని కల్పించింది. By V.J Reddy 06 Mar 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి TSRTC: సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది టీఎస్ఆర్టీసీ. ప్రయాణికుల సౌకర్యార్థం లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సుల్లో బెర్త్‌లపై 10 శాతం రాయితీ కల్పించాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సాధారణ టికెట్ ధరలో ప్రయాణికులు బుక్ చేసుకునే బెర్త్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను కల్పించింది. లహరి ఏసీ స్లీపర్, ఏసీ స్లీపర్ కమ్ సీటర్ బస్సులు తిరిగే అన్ని రూట్లలోనూ ఈ రాయితీ వర్తిస్తుంది. ALSO READ: ఇల్లు కట్టుకునే వారికి రూ.5 లక్షలు.. మంత్రి కీలక ప్రకటన ఏప్రిల్ 30 వరకు డిస్కౌంట్ అమల్లో ఉంటుందని తెలిపింది. లహరి ఏసీ స్లీపర్ బస్సులు హైదరాబద్ నుంచి చెన్నై, తిరుపతి, విశాఖపట్నం, బెంగళూరు రూట్లలో నడుస్తుండగా.. లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ సర్వీసులు హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, అసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ కు, గోదావరిఖని-బెంగళూరు, కరీంనగర్-బెంగళూరు, నిజామాబాద్ -తిరుపతి, నిజామాబాద్ -బెంగళూరు, వరంగల్-బెంగళూరు రూట్లలో తిరుగుతున్నాయని తెలిపింది. ఈ రూట్లలో సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు 10 శాతం రాయితీని వినియోగించుకుని, టీఎస్ఆర్టీసీ బస్సుల్లో క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. #tsrtc-md-sajjanar #telangana-latest-news #tsrtc #discount-on-bus-tickets సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి