PM Modi: గాజా ఆసుపత్రి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..

ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కొనసాగుతున్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

New Update
PM Modi: మోదీకి తగ్గని క్రేజ్..అత్యంత ప్రజాదరణ నేతగా మరోసారి అగ్రస్థానంలో ప్రధాని..!!

Modi Condemns Gaza Hospital Attack: ఇజ్రాయెల్ హమాస్ (Israel - Hamas) మిలిటెంట్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువుగా గాజా ప్రాంతం మారిపోయింది. అయితే మంగళవారం అక్కడ అల్ అహ్లీ (Al Ahli Hospital ) అనే ఆసుపత్రిలో పేలుడు సంభవించి దాదాపు 500 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటనకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ హమాస్ ఉగ్రమూల చర్యే అంటూ విమర్శలు చేశారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం కొనసాగుతన్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Also Read: హమాస్ దాడుల్లో కేరళ మహిళల తెగువ.. వీడియో వైరల్

గాజాలోని అల్‌ అహ్లి ఆసుపత్రిలో ప్రాణనష్టం జరగడం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. ప్రస్తుత ఘర్షణల్లో (ఇజ్రాయెల్‌-హమాస్‌ పోరును ఉద్దేశిస్తూ) సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత తీవ్రమైన, ఆందోళనకర విషయం. ఇందుకు కారకులనవారికి శిక్ష పడాలంటూ ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.ఇదిలా ఉండగా.. ఈ ఆస్పత్రి ఘటనకు సంబంధించి ఇజ్రాయెల్ ఓ వీడియోను విడుదల చేసింది. పీఐజే ఉగ్రవాదులు ప్రయోగించినటువంటి రాకెట్ గురి తప్పడం వల్ల అది ఆసుపత్రిపై పడిపోయిందటూ పేర్కొంది.

మరోవైపు ఈ దాడిని పలు దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. హమాస్‌ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు సంఘీభావం తెలిపడానికి.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మంగళవారం టెల్‌ అవీవ్‌కు చేరుకున్నారు. ఆయనకు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు (Netanyahu) స్వాగతం పలికారు. హమాస్‌ మిలిటెంట్లు దుర్మార్గాలకు పాల్పడ్డారని.. ఇలాంటి తరుణంలో హమాస్‌కు వ్యతిరేకంగా ఇజ్రాయెల్‌ చేస్తోన్న పోరుకు అమెరికా మద్దతుగా నిలుస్తుందనే విషయాన్ని చెప్పడానికి ఇక్కడ అడుగుపెట్టినట్లు తెలిపారు జో బైడెన్.

Advertisment
Advertisment
తాజా కథనాలు