సుప్రీంకోర్టు 75వ వార్షికోత్సవం వేడుకలు న్యూ ఢిల్లీలో జరగుతున్నాయి. నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్ జ్యుడిషియరీ పేరుతో జరుగుతున్న ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆమె సుప్రీంకోర్టుకు సంబంధించిన కొత్త జెండాను, చిహ్నాన్ని ఆవిష్కరించారు. ఆ జెండాలో అశోక చక్రం, సుప్రీంకోర్టు భవనం, అలాగే రాజ్యాంగ పుస్తకం ఉన్నాయి. న్యాయం, ప్రజాస్వామ్యాన్ని ప్రతీకగా ఉండే ఈ సుప్రీంకోర్టు జెండాను, చిహ్నాన్ని ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ రూపొందించింది. ఈ కార్యక్రమానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కూడా హాజరయ్యారు.
Also Read: ప్రధాని మోదీపై ప్రశంసలు.. వేదికపై ఏం చేశారంటే