/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/pregnant-women-eat-saffron-flower-chance-of-a-smooth-delivery-jpg.webp)
Eating Saffron Flower : చాలా మంది మహిళలు(Women's) సిజేరియన్‌ల ద్వారా పిల్లలకు జన్మనిస్తున్నారు. నార్మల్ డెలివరీ(Normal Deliveries) లు చాలా వరకు తగ్గిపోయాయి. మారిన జీవనశైలి(Life Style) , వివిధ రకాల ఆహారపు అలవాట్ల కారణంగా సిజేరియన్ చేయాల్సి వస్తోంది. సుఖప్రసవం జరగాలంటే మహిళలు కుంకుమ పువ్వు తీసుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. సాధారణంగా పాలతో కలిపి కుంకుమ పువ్వు తింటే పిల్లలు అందంగా పుడతారని అంటున్నారు.
కుంకుమ్మ పువ్వుతో రంగు పెరగదా..?
- కుంకుమ పువ్వు(Saffron Flower) కు, పిల్లవాడి రంగుకు అస్సలు సంబంధం లేదని నిపుణులు అంటున్నారు. కేవలం సుఖ ప్రసవం అయ్యే అవకాశమే ఉంటుందని చెబుతున్నారు. పుట్టబోయే శిశువు రంగులో అస్సలు తేడా ఉండదని, గర్భిణులు కుంకుమపువ్వు తినేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. గర్భిణులు తొలి నాలుగు నెలల వరకు కుంకుమపువ్వుకు దూరంగా ఉండాలని చెబుతున్నారు. సాధారణంగా కుంకుమ పువ్వుకు కదలికలను పెంచే శక్తి ఉంటుంది. 4 నెలల్లోపు కుంకుమ పువ్వు తింటే అబార్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. నాలుగు నెలల తర్వాత ఒక అరగ్రాము నుంచి గ్రాము వరకు అది కూడా రోజులో ఒకసారి మాత్రమే పాలతో కలిపి తినాలని చెబుతున్నారు.
- నెలలు నిండిన వాళ్లు కూడా ఎక్కువగా కుంకుమ పువ్వు తింటే అబార్షన్ అవుతుందని అంటున్నారు. తక్కువగా తీసుకుంటే గర్భాశయ కండరాలు చురుగ్గా ఉండటమే కాకుండా కదలికలు కూడా బాగుంటాయని గైనకాలజిస్ట్‌లు అంటున్నారు. సిజేరియన్ చేయాల్సిన అవసరం పడదని చెబుతున్నారు. గర్భిణుల్లో నెలలు నిండేకొద్దీ బీపీ పెరుగుతుందని, ఈ పువ్వు తినడం వల్ల బీపీ కంట్రోల్(BP Control) లో ఉంటుందని నిపుణులు అంటున్నారు. కుంకుమ పువ్వు వాడటం వల్ల మహిళల్లో మూడ్ స్వింగ్స్ అదుపులో ఉంటాయని, డిప్రెషన్ సమస్యలు ఉండవని డాక్టర్లు చెబుతున్నారు. కుంకుమ పువ్వు తింటూ రోజూ నైట్ భోజనం తర్వాత వాకింగ్(Walking) చేస్తే సుఖ ప్రసవం అవుతుందని సలహా ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: నెల రోజుల్లో శరీరంపై నలుపు పొగొట్టి తెల్లగా మార్చే చిట్కాలు
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.