Pregnant Women: గర్భిణులు చికెన్ తినవచ్చా..వైద్యులు ఏం చెబుతున్నారు? ప్రతి మహిళలు గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం ముఖ్యం. చిన్నపాటి అజాగ్రత్త కూడా శిశువుకు హాని కలిగిస్తుంది. గర్భధారణ సమయంలో ఒక్కోసారి ఏదైనా రుచి నచ్చితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. ఇక గర్భిణీలు చికెన్ తినవచ్చా లేదో తెలుసుకునేందుకు ఆర్టికల్‌లోకి వెళ్లండి. By Vijaya Nimma 01 Apr 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Chicken During Pregnancy: ప్రతి గర్భిణీ గర్భధారణ సమయంలో పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యం. తల్లి చిన్నపాటి అజాగ్రత్త కూడా శిశువుకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ సమయంలో ఆహారంలో నియంత్రణ చాలా ముఖ్యమని వైద్యులు అంటున్నారు. గర్భధారణ సమయంలో మహిళల్లో మానసిక కల్లోలం, ఆహార కోరికలు, రుచి మార్పులు నిరంతరం జరుగుతాయి. ఒక్కోసారి ఏదైనా రుచి నచ్చితే మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. గర్భిణీ స్త్రీ (Pregnant Women) గర్భధారణ సమయంలో చికెన్ తినవచ్చని వైద్యులు అంటున్నారు. అయితే ఇది గర్భిణీలకు ఎంత మేలు చేస్తుందో, తినేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అవసరం అని సూచిస్తున్నారు. గర్భిణులకు చికెన్ వల్ల ప్రయోజనాలు: చికెన్ ప్రోటీన్ అద్భుతమైన మూలం. శిశువు పెరుగుదలకు ప్రోటీన్ చాలా అవసరం. చికెన్‌లో ఉండే ప్రొటీన్ బేబీ సెల్స్ ఏర్పడటానికి సహాయపడుతుందని వైద్యులు అంటున్నారు. చికెన్‌లో ఐరన్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. హిమోగ్లోబిన్ శరీరంలోని కణాలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్తుంది. చికెన్‌లో కొవ్వు తక్కువగా ఉంటుంది. గర్భిణులు చికెన్ తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి..? చికెన్ తినడానికి ముందు అది బాగా ఉడికిందని నిర్ధారించుకోవడం అవసరం. గర్భిణీ స్త్రీలకు తక్కువ ఉడికించిన లేదా పచ్చి చికెన్ ఇవ్వకూడదు. ప్రస్తుతం మార్కెట్‌లో వస్తున్న కోళ్లను కృత్రిమంగా పెంచుతున్నారు. ఇది గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. గర్భధారణ సమయంలో ఆహారంలో ఏదైనా మార్పులు చేసుకుంటే తప్పనిసరిగా వైద్యుడిని సంప్రదించాలి. ఇది కూడా చదవండి: ప్రయాణంలో పిల్లలు వాంతులు చేసుకుండా చేసే చిట్కాలు గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-benefits #pregnant-women #chicken #doctors-say మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి