Health Tips : గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా?

గర్భిణులు నార్మల్‌ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలామంది అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందంటారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు.

New Update
Health Tips : గర్భిణులు నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా?

Pregnant Ladies : నెయ్యి(Ghee) తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కానీ ఎక్కువ నెయ్యి తినడం వల్ల బరువు వేగంగా పెరుగుతారు. నెయ్యి తింటే నార్మల్ డెలివరీ(Normal Delivery) అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది అంటున్నారు. అయితే గర్భధారణ(Pregnancy) సమయంలో నెయ్యి ఎంత తినాలి? నెయ్యి తింటే నార్మల్ డెలివరీ అవుతుందా తెలుసుకుందాం. గర్భిణులు సాధారణంగా నార్మల్‌ డెలివరీ కావడానికి ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుత కాలంలో మారుతున్న జీవనశైలి కారణంగా నార్మల్ డెలివరీ కాకుండా సిజేరియన్ కేసులు పెరుగుతున్నాయి.

నెయ్యితో సాధారణ ప్రసవం సాధ్యమా?

  • మూడవ నెలలో నెయ్యి ఎక్కువగా తింటే నార్మల్ డెలివరీ సాధ్యమే అని అంటున్నారు. నెయ్యి తినడం ద్వారా లూబ్రికేషన్ పేరుకుపోతుందని, దీంతో ప్రసవం సులభంగా ఉంటుందని చెబుతున్నారు. కానీ నిపుణులు మాత్రం ఇందులో వాస్తవం లేదంటున్నారు.

నిపుణులు ఏమంటున్నారు?

  • సీనియర్ గైనకాలజిస్ట్‌లు BMI ప్రకారం గర్భధారణ సమయంలో 5 నుంచి 8 టీస్పూన్ల కొవ్వును తీసుకోవడం అవసరం అంటున్నారు. అయితే వీటిలో 12% సంతృప్త కొవ్వును మాత్రమే తీసుకోవచ్చని, అంటే 1 లేదా 2 స్పూన్ల నెయ్యి రోజుకు తింటే మంచిదని అంటున్నారు. అంతేకానీ నెయ్యి తీసుకుంటే నార్మల్ డెలివరీ అవుతుందనేది పూర్తి అపోహ అని చెబుతున్నారు. ఇతర పోషకాలతో పాటు నెయ్యి కూడా చాలా అవసరని, ఎక్కువగా నెయ్యి తీసుకుంటే బరువు పెరుగుతారని(Weight Gain) అంటున్నారు. అంతేకాకుండా సిజేరియన్ అయ్యే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు. అందుకే గర్భధారణ సమయంలో నెయ్యి అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి.

Also Read : సికింద్రాబాద్ ఓయూ పీజీ లేడీస్ హాస్టల్ దగ్గర ఉద్రిక్త వాతావరణం

గర్భిణులు నెయ్యి తింటే కలిగే దుష్ప్రభావాలు

1.మల బద్ధకం పెరగడం
2.బరువు పెరగడం వల్ల సిజేరియన్ డెలివరీ అవుతుంది.
3.డెలివరీ తర్వాత బరువు తగ్గడం కష్టం
4. పుట్టే పిల్లలు కూడా అధిక బరువుతో పుడతారు.
5. నెయ్యి వల్ల వికారంగా అనిపిస్తుంది

వైద్యులు ఇచ్చే సలహా

  • డాక్టర్‌తో మాట్లాడి అవసరం మేరకే నెయ్యి తీసుకోండి. సాధారణ డెలివరీ కోసం మూడో నెల నుంచే శారీరక శ్రమను పెంచాలి. ప్రతిరోజు అరగంట నడవడం, తేలికపాటి వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు.

ఇది కూడా చదవండి: చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు వస్తుంది?..లక్షణాలేంటి?

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Advertisment
Advertisment
తాజా కథనాలు