Pre Wedding Shoot:మరీ ఇంత పిచ్చేంటీ..ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఆర్టీసీ బస్సును వాడేసుకుంటారా...

భారతదేశంలో పెళ్ళిళ్ళు చాలా రకాలున్నాయి. దాని ముందు వేడుకలకు కొదవ లేదు. ఇప్పుడు అవన్నీ సరిపోనట్టు ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి ట్రెండింగ్‌లో ఉంది. అమ్మాయి, ఈ ఫోటో షూట్‌ వల్ల ఎవరికీ ఏమీ ఇబ్బంది లేదు కానీ...దీని కోసం వాళ్లు వేసే వెర్రి వేషాలు చూస్తేనే జనాలకు మండుకొస్తోంది.

New Update
Pre Wedding Shoot:మరీ ఇంత పిచ్చేంటీ..ప్రీవెడ్డింగ్ షూట్ కోసం ఆర్టీసీ బస్సును వాడేసుకుంటారా...

Pre Wedding Shoot: ప్రీ వెడ్డింగ్ షూట్...వెర్రి వెయ్యి తలలు అన్నట్టు.. ఇప్పుడు పెళ్ళిళ్ళు చేసుకునే వాళ్ళకు ఈ పిచ్చి పట్టుకుంది. ప్రతీ ఒక్కరు తమలో ఉన్న క్రియేటివిటీ అంతా ఉపయోగించేసి మరీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ చేసేసుకుంటున్నారు. దీని కోసం వాడని ప్రాపర్టీ లేదు. ఎక్కడ పడితే అక్కడ...ఎలా పడితే అలా ఫోటోలు తీసుకుంటూ తెగ వైరల్ అవుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఆర్టీసీ బస్సులో ప్రీ వెడ్డింగ్ షూట్ ఒకటి జరిగింది. అది కూడా జనాలు అందరూ ఉన్నప్పుడు...మంచి రద్దీగా ఉన్న టైమ్‌లో.

Also read:7 రోజులు.. రెండు హై ఫ్రొఫైల్ హత్యలు.. 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు!

క్రియేటివిటీ పిచ్చి పీక్స్...

నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చే రోజులు పోయాయి. ఫ్రీ వెడ్డింగ్ షూట్‌ అంటే రకరకాల థీమ్స్, లొకేషన్లు... సాంగ్స్ కోసం మూవీ రేంజ్ సెటప్‌లు, గెటప్‌లు అబ్బో...చాలా హంగామానే ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం దేశ, విదేశాలు తిరిగేసిన వాళ్ళున్నారు. కొండలు, గుట్టలు, చెరువులు, పోలాలు, బురద...ఇలా దేన్నీ వదిలిపెట్టడం లేదు. బట్టలేసుకుని కొంతమంది...సరిగ్గా బట్టలు లేకుండా కొంత మంది...ట్రెడిషనల్‌గా కొంతమంది...వెస్ట్రన్ అవుట్ ఫిట్‌లో మరి కొంతమంది ఇలా. ఇవి చాలా సార్లు మితిమీరుతున్నాయి కూడా.

ఆర్టీసీ బస్సు వాడేసుకున్నారు...

ఇప్పుడు హైదరాబాద్‌లో జరిగిన ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా హాట్ టాపిక్ అయింది. పబ్లిక్ ప్రాపర్టీ అయిన ఆర్టీసీ బస్సును తమ అవసరాల కోసం వాడేసుకోవడంతో జనాలు దీని మీద మండిపడుతున్నారు. వధూవరుల మీద ఒక సాంగ్ షూట్ చేస్తున్నారు. అందులో అమ్మాయి బస్సు దిగి వస్తుంటే అబ్బాయి వెనక పడతాడు. ఇదీ థీమ్. దీనికొక సాంగ్ కూడా సెలెక్ట్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ ఆలోచనలో ఏం తప్పు లేదు. కానీ వాళ్ళు ఆర్టీసీ బస్సును వాడుకున్న విధానమే జనాలకు కోపం తెప్పిస్తోంది. మీరు ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకుంటే ఒక బస్సును బుక్ చేసుకోవడమో ఏదో చేయాలి కానీ...పబ్లిక్ ఉన్న బస్సు అది కూడా మంచి ట్రాఫిక్ టైమ్‌లో ఎలా వాడుకుంటారు అని అడుగుతున్నారు.

సీబీఎస్ నుంచి పటాన్ చెరువు వెళ్తున్న 217సీ ఆర్టీసీ బస్సు మొజంజాహీ మార్కెట్ దగ్గర ఆగిన ఫోటో షూట్ చేసుకున్నారు. అయితే ఫోటో ష్ట్రట్ ఒక్కసారి చెయ్యగానే అయిపోదు కదా. అది సరిగ్గా వచ్చే వరకు జరుగుతూనే ఉంటుంది. పాపం నేచురాలిటీ కోస్ ఫోటోగ్రాఫర్ చాలా ప్రయత్నించాడు. అందుకే ట్రాఫిక్ ఉన్న ఏరియా, జనాల ఉన్న బస్సును ఎంచుకున్నాడు. అమ్మాయి బస్సు దిగి నడుస్తుంటే...అబ్బాయి వెంటపడడం...రోడ్డు మీదే కలవడం, డాన్స్ చేయడం అన్నీ షూట్ చేసుకున్నారు.

సెన్స్ లేదా అని తిడుతున్న జనం..

అయితే ఇప్పుడు దీన్నే జనాలు తిట్టిపోస్తున్నారు. ఇంత సెన్స్‌లెస్ గా ఎలి బిహేవ్ చేస్తారు అని అడుగుతున్నారు. పబ్లిక్ ప్లేస్‌లో ఇలాంటి షూట్‌ ఏమిటి...బుద్ధి ఉండక్కర్లేదా అంటూ విమర్శిస్తున్నారు. జనాలకు ఇబ్బంది అవడమే కాదు...ఆ షూట్‌ గోలలలో వాళ్ళకు కూడా ఏదైనా జరగొచ్చు కదా అంటూ అడుగుతున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో చాలా మంది కామెంట్లు పెడుతున్నారు. కొంతమంది టీఎస్ ఆర్టీసీని ట్యాగ్ చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు