Sunita Kejriwal : ఢిల్లీ(Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్(Aravind Kejriwal) ను లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case) లో ఈడీ(ED) అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. శుక్రవారం రోజు ఆయనకు 6 రోజుల కస్టడీకి అనుమతిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఆప్ శ్రేణులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఆయన భార్య సునీతా కేజ్రీవాల్(Sunita Kejriwal) కూడా.. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై నిన్న స్పందించారు. అధికార దురాహంకారంతో ప్రధాని మోదీ.. కేజ్రీవాల్‌ను అరెస్టు చేశారని విమర్శలు చేశారు. కేజ్రీవాల్ జైల్లో ఉన్నా బయట ఉన్న ఆయన జీవితం దేశానికే అంకితమని చెప్పారు. అయితే తాజాగా ఈరోజు (శనివారం) మరో వీడియోను రిలీజ్ చేశారు. ఈ వీడియోలో.. అరవింద్ కేజ్రీవాల్ జైలు నుంచి పంపిన సందేశాన్ని సునీతా కేజ్రీవాల్ చదివి వినిపించారు.
Also Read : దక్షిణాదికి నీటి కొరత ముప్పు.. రిజర్వాయర్లలో తగ్గిపోతున్న నీటి మట్టాలు
వాళ్లని ఓడించండి
' నా ప్రియమైన దేశ ప్రజలారా నిన్న నేను అరెస్టు అయ్యాను. నేను లోపల ఉన్నా.. బయట ఉన్నా ప్రతిక్షణం దేశం కోసమే పనిచేస్తాను. ఈ అరెస్టు నన్ను ఆశ్చర్యపరచలేదు. బీజేపీ(BJP) పై నా అరెస్టు విషయంలో ఎలాంటి ద్వేషం చూపించకండి. వారు మన సోదరసోదరీమణులు. సమాజం కోసం మీ పని కొనసాగించండి. దేశాన్ని బలహీనపరిచేలా చేసే శక్తులు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిని గుర్తించి ఓడించండి. మీ సోదరుడు, కుమారుడైన నాపై ఢిల్లీ మహిళలు నమ్మకం ఉంచాలని కోరుతున్నాను. నన్ను ఎక్కువకాలం జైల్లో ఉంచే ప్రసక్తే లేదు. త్వరలోనే వచ్చి.. మీకిచ్చిన హామీలు నెరవేరుస్తాని' అరవింద్ కేజ్రీవాల్ సందేశాన్ని.. సునితా కేజ్రీవాల్ వివరించారు.
కేజ్రీవాల్ రాజీనామా చేయాల్సి వస్తే
ఇదిలా ఉండగా.. ప్రస్తుతం జైల్లో ఉన్న కేజ్రీవాల్ జైల్లో నుంచే సీఎం బాధ్యతలు కొనసాగిస్తారని ఆప్ సర్కార్ ప్రకటించింది. ఒకవేళ.. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తే.. విద్యాశాఖ మంత్రి ఆతిశీ మార్లేనా, వైద్యశాఖ మంత్రి సౌరభ్ భరద్వాజ్ పేర్లు బయటికి రావొచ్చని పలువురు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వీళ్లతో పాటు కేజ్రీవాల్ భార్య సునితా కేజ్రీవాల్ కూడా ఈ రేసులో ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు.
Also Read : నేడు ఈడీ ముందుకు కేజ్రీవాల్.. ఏం ప్రశ్నలు అడుగుతారంటే !