Praveen Kumar Slams Hardik Pandya: భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యకు మాజీ ఇండియన్ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) టోర్నీలో గాయపడిన పాండ్య నాలుగు నెలల గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దేశవాళీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపీఎల్‌లో (IPL) పాల్గొనడంపై ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు.
నాకు అర్థం కావడం లేదు..
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ ఎంట్రీ గురించి మాట్లాడిన ప్రవీణ్.. ‘ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తొందరపాటు నిర్ణయం తీసుకుందా? లేదా హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడం సరైందేనా? ఎందుకంటే గత రెండు నెలల్లో హార్దిక్ క్రికెట్ ఆడలేదు. జాతీయ జట్టుకు ఆడలేదు. దేశవాళీ టోర్నీల్లోనూ పాల్గొనలేదు. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడేందుకు వస్తున్నాడు. దీనిని ఎలా అభివర్ణించాలో అర్థం కావడం లేదు. డబ్బు సంపాదన ముఖ్యమే. కానీ.. ముందుగా రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌కే ప్రాముఖ్యత ఇవ్వడం బాధకరం' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు.
ఇది కూడా చదవండి: Rishabh Pant: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. పంత్ వస్తున్నాడు!
ఆదాయం కోసమే..
అలాగే ఆదాయం కోసమే ఐపీఎల్ ఆడటం సరైనది కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావించాలని సూచించాడు. అయినప్పటికీ కొందరిలో ఆ భావన కనిపించడం లేదని, ఐపీఎల్‌కు ఒక నెల ముందు విశ్రాంతి తీసుకుని ఆడేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు.