Cricket: పైసలకోసం కాదు దేశం కోసం ఆడు.. పాండ్యకు ప్రవీణ్ చురకలు! స్టార్ క్రికెటర్ హార్డిక్ పాండ్యకు మాజీ బౌలర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. దేశవాళీ టోర్నీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపిఎల్ ఎలా ఆడతాడని ప్రశ్నించాడు. డబ్బులకోసం ఆరాట పడటం కంటే దేశానికి ప్రాతినిథ్యం వహించడం గర్వంగా ఫీల్ కావాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. By srinivas 13 Mar 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి Praveen Kumar Slams Hardik Pandya: భారత స్టార్ ప్లేయర్ హార్దిక్ పాండ్యకు మాజీ ఇండియన్ క్రికెటర్ ప్రవీణ్ కుమార్ కీలక సూచనలు చేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ (ODI World Cup 2023) టోర్నీలో గాయపడిన పాండ్య నాలుగు నెలల గ్యాప్ తర్వాత ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. అయితే దేశవాళీ, జాతీయ జట్టుకు ఆడకుండా డైరెక్ట్ ఐపీఎల్‌లో (IPL) పాల్గొనడంపై ప్రవీణ్ కుమార్ అసహనం వ్యక్తం చేశాడు. ముంబై తీసుకున్న నిర్ణయాన్ని తప్పుబట్టాడు. Day 1. So many emotions, so many memories. Seeing old friends and reliving the good old days. Excited for what's ahead with this wonderful team. Let's get down to business 💙 @mipaltan pic.twitter.com/B1q29JBgwz — hardik pandya (@hardikpandya7) March 12, 2024 నాకు అర్థం కావడం లేదు.. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో హార్దిక్ ఎంట్రీ గురించి మాట్లాడిన ప్రవీణ్.. ‘ముంబై ఇండియన్స్ (Mumbai Indians) తొందరపాటు నిర్ణయం తీసుకుందా? లేదా హార్దిక్ పాండ్యను కెప్టెన్‌గా నియమించడం సరైందేనా? ఎందుకంటే గత రెండు నెలల్లో హార్దిక్ క్రికెట్ ఆడలేదు. జాతీయ జట్టుకు ఆడలేదు. దేశవాళీ టోర్నీల్లోనూ పాల్గొనలేదు. నేరుగా ఐపీఎల్‌లోనే ఆడేందుకు వస్తున్నాడు. దీనిని ఎలా అభివర్ణించాలో అర్థం కావడం లేదు. డబ్బు సంపాదన ముఖ్యమే. కానీ.. ముందుగా రాష్ట్రం, దేశం కోసం ఆడితే బాగుంటుందని నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ ఐపీఎల్‌కే ప్రాముఖ్యత ఇవ్వడం బాధకరం' అంటూ తన మనసులో మాట బయటపెట్టాడు. ఇది కూడా చదవండి: Rishabh Pant: పక్కకు తప్పుకోండి తమ్ముళ్లు.. పంత్ వస్తున్నాడు! ఆదాయం కోసమే.. అలాగే ఆదాయం కోసమే ఐపీఎల్ ఆడటం సరైనది కాదని, దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వకారణంగా భావించాలని సూచించాడు. అయినప్పటికీ కొందరిలో ఆ భావన కనిపించడం లేదని, ఐపీఎల్‌కు ఒక నెల ముందు విశ్రాంతి తీసుకుని ఆడేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. #mumbai-indians #hardik-pandya #ipl #praveen-kumar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి