Prashanth Kishor Clarifies about Meeting with Chandrababu : ప్రముఖ రాజకీయ వ్యూహకర్త, IPAC మాజీ చీఫ్ ప్రశాంత్ కిశోర్(Prashanth Kishor) ఇటీవల టీడీపీ అధినేత చంద్ర బాబు నాయుడును కలిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించారు. 2019లో జగన్‌ను అధికారంలోకి తెచ్చిన తర్వాత 2024లో ప్రశాంత్ టీడీపీ(TDP) కి పని చేస్తారంటూ ఆ సమావేశం తర్వాత జోరుగా ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారానికి చెక్ పెట్టారు ప్రశాంత్ కిశోర్. జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని స్వయంగా ప్రకటించారు. ఇకపై చంద్రబాబు(Chandrababu) తో లేదా జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) తో కలిసి పనిచేయడం లేదని నిస్సందేహంగా చెప్పేశారు. 2024లో జరిగే ఎన్నికలకు చంద్రబాబుతో గానీ, జగన్‌తో గానీ భాగస్వామ్యంలో లేనని పీకే ధృవీకరించారు.
అతనికి ముందే చెప్పా:
టీడీపీతో కలిసి పనిచేయడం లేదని పీకే క్లారిటీ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల్లో పనిచేయమని చంద్రబాబు అడిగారని.. ఆ పని వదిలేశానని.. పని చేయలేనని చెప్పానన్నారు. తన ఇద్దరి కామన్ ఫ్రెండ్ ఫోర్స్ చేయడం వల్లే వెళ్లానని బాంబు పేల్చారు. టీడీపీకి పనిచేయనని ముందే తన ఫ్రెండ్‌తో చెప్పినట్టు చెప్పుకొచ్చాడు. చంద్రబాబును కలిసి ఈ విషయం చెప్పాలని కోరాడని.. అందుకే చంద్రబాబుని కలవాల్సివచ్చిందన్నారు పీకే.
నెలరోజుల కిందట చంద్రబాబుతో ప్రశాంత్ కిశోర్ సమావేశం కావడం కాక రేపింది. హైదరాబాద్(Hyderabad) నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లారు పీకే. నాటి మీటింగ్‌పై నేడు క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ మాజీ సహచరులు రాబిన్ శర్మ, శంతను సింగ్‌లు నడుపుతున్న షోటైమ్ కన్సల్టింగ్ సంస్థ టీడీపీకి సలహా ఇస్తోంది.. 2019 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది, మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 23 మాత్రమే గెలిచింది.
Also Read: వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా
WATCH: