Breaking : వైసీపీకి బిగ్ షాక్.. ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా నరసరావుపేట ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు వైసీపీకి రాజీనామా చేశారు. దాంతో పాటూ ఎంపీ పదవికి కూడా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడడం వలనే తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. By Manogna alamuru 23 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి YCP in Shock : నరసరావుపేట(Narasaraopeta) ఎంపీ లావు శ్రీ కృష్ణ దేవరాయులు(Lavu Sri Krishna Devarayalu) వైసీపీ(YCP) కి రాజీనామా చేశారు. దాంతో పాటూ ఎంపీ పదవికి కూడా రాజీనామా(Resign) చేసినట్లు తెలుస్తోంది. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడడం వల్లనే తాను రాజీనామా చేస్తున్నానని శ్రీకృష్ణదేవరాయలు చెబుతున్నారు. నరసరావు పేటటో బీసీ అభ్యర్ధిని బరిలోకి దించే యోచనలో ఉన్న అధిష్టానం అక్కడ ఎంపీ అయిన రాయలను అదిష్టానం గుంటూరు నుంచి పోటీ చేయాలని అడిగింది. దానికి శ్రీకృష్ణదేవరాయలు ఒప్పుకోలేదు. అమధ్య వైసీపీ అధినేత జగన్ పిలిచి మాట్లాడినప్పుడు కూడా ఇదే చెప్పారు. కొంత మంది వైసీపీ నేతలు కూడా రాయలను మార్చొద్దని జగన్(YS Jagan) కు చెప్పారు. కానీ అధిష్టానం తన నిర్ణయం మార్చుకోలేదు. ఇప్పుడు ఈ కారణంగానే శ్రీకృష్ణ దేవరాయలు పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. పోటీ చేస్తే నరసరావు పేట నుంచే చేస్తానని తేల్చి చెబుతున్నారు. పల్నాడు ప్రజలు నన్ను ఎంతో ఆదరించారు. గత ఎన్నికలలో మంచి మెజారిటీతో పార్లమెంట్ పంపించారు. నా వంతుగా నేను పల్నాడు ప్రాంత అభివృద్ధి కు కృషి చేశాను. వారిని వీడి వెళ్ళే ఉద్దేశం లేదని అంటున్నారు. Also read:తెలంగాణలో వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డులు గత పది రోజులుగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను మార్చొద్దంటూ పల్నాడు నేతలు జగన్ కు చెబుతూనే ఉన్నారు. అదిష్టానం కూడా ఇంకా నరసరావు పేట ఎంపీ సీటు మీద ఏ ప్రకటనా చేయలేదు. కానీ ఈలోపే రాయలు రాజీనామా చేవారు. రాజకీయంగా కొంత అనిశ్చితి ఏర్పడిందని... దానికి నేను బాధ్యుడుని కానని శ్రీకృష్ణదేవరాయలు చెప్పారు. ఎంపీని కలిసేందుకు మాచర్ల, పెదకూరుపాడు ఎమ్మెల్యేలు బయలుదేరారు కానీ ఈలోపునే శ్రీకృష్ణదేవరాయలు రాజీనామా చేశారు. ఆంధ్రాలో హాట్ టాపిక్‌గా వైసీపీ.. వైసీపీలో జరుగుతున్న మార్పులు హాట్ టాపిక్ అవుతున్నాయి. ఇందులో తాజాగా పలువురు ఎంపీల స్థానాలను కూడా మార్చారు. మిగతావి ఎలా ఉన్నా ఈ స్థానాల మార్పులో నరసరావుపేట ఎంపీ సీటు ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం నరసరావుపేట సిట్టింగ్ ఎంపీగా విజ్ఞాన్ స్కూల్స్ అధిపతి లావు రత్తయ్య కుమారుడు లావు శ్రీకృష్ణదేవరాయలు ఉన్నారు. అయితే ఇతని ని వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట నుంచి కాకుండా గుంటూరు నుంచి పోటీ చేయాలని వైసీపీ ఆదేశించింది. నరసరావుపేట సీటు బిసీలకే ఇవ్వాలని వైసీపీ, టీడీపీలు డిసైడ్ అవ్వడమే ఇందుకు కారణం. దీంతో నిన్న శ్రీకృష్ణదేవరాయలను వైసీపీ క్యాలయానికి పిలిచి కూడా మాట్లాడారు. అయితే ఎవరెన్ని చెప్పినా తాను గుంటూరు కు వెళ్లలేనని తెల్చి చెప్పేశారు లావు కృష్ణదేవరాయులు. నరసరావుపేట తప్ప వేరే ఎక్కడా పోటీ చేయలేనని అధిష్టానికి స్పష్టం చేశారుట. బీసీలకే నర్సరావుపేట.. నరసరావుపేట సీటు బిసీలకే ఇవ్వాలని వైసీపీ, టీడీపీలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. బిసీ సామాజిక వర్గానికి చెందిన జంగా కృష్ణమూర్తిని లేదా యాదవ కమ్యూనిటీ కి చెందిన అభ్యర్థిని పెట్టె ఆలోచనలో ఉంది వైసీపీ అధిష్టానం. మరోవైపు టీడీపి కూడా నరసరావుపేట ఎంపీ టికెట్ బిసీ కి ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ టీటీడీ చైర్మన్ పుత్తా సుధాకర్ యాదవ్ ను దింపే అలోచన చేస్తోందని నమాచారం. Also Read : China : చైనాను కుదిపేసింది..ఢిల్లీని వణికించింది #mp #narasaraopeta #ycp #srikrishna-devarayalu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి