బన్నీ సన్మానంలో సంచలన కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్

ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి చాలా దమ్ముండాలి. ఎవరిని నొప్పించకుండా ఉండేలా నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోతే గొప్పేముంటుంది. ప్రకాష్ రాజ్ అని ఎలా అనిపించుకుంటారు. ఎవరైనా, ఏ విషయమైనా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడడం, ఎవ్వరినీ లెక్క చేయకపోవడం ఒక్క ప్రకాష్ రాజ్ మాత్రమే చేయగలడు. ఇదే ఆటిట్యూడ్ తో మళ్ళీ టాలీవుడ్ లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తాజాగా అల్లు అర్జున్ నేషనల్ అవార్డు అందుకోవడం.. తెలుగు సినిమాలకు జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలు వచ్చిన నేపథ్యంలో మైత్రి మూవీస్ అధినేతలు ఒక పార్టీని ఏర్పాటు చేశారు. అందులో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

New Update
బన్నీ సన్మానంలో సంచలన కామెంట్స్ చేసిన ప్రకాష్ రాజ్

నేషనల్ అవార్డులు అందుకున్న వారందరి గుర్తుగా మైత్రీ మూవీస్ ఓ పార్టీని ఏర్పాటు చేసింది. ఇందులో బన్నీకి సన్మానం చేశారు. ఈ ప్రోగ్రాంకు హాజరైన ప్రకాశ్ రాజ్.. టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలపై సంచలన కామెంట్లు చేశారు. ఎలాంటి మొహమాటం లేకుండా.. తప్పుల్నిఎత్తి చూపుతూ కడిగిపారేశారు. టాలీవుడ్ లో పలువురికి జాతీయ అవార్డులు దక్కడం.. తెలుగువారందరూ గర్వపడాల్సిన విషయమని.. ఇలాంటి సందర్భంలో చిత్రపరిశ్రమలో అందరూ కలిసి రాకపోవటాన్ని ఆయన ప్రశ్నించారు. జాతీయ అవార్డు పొందిన అల్లు అర్జున్ ను సన్మానించడానికి సినీ పరిశ్రమ ఎందుకు కలిసి రావట్లేదు? బన్నీకి జాతీయ అవార్డు వస్తే.. అది తెలుగు సినిమా పరిశ్రమలోని వారందరికి గర్వ కారణం కాదా అని ప్రశ్నించారు . రాజమౌళి మన తెలుగు సినిమాను ఆస్కార్ కు తీసుకెళితే.. అది తెలుగు పరిశ్రమకు.. తెలుగు వారందరికి గర్వకారణం. అలాంటిది బన్నీకి సన్మానం జరుగుతుంటే సినిమా పెద్దలు ఎందుకు రాలేదు అంటూ కడిగేశారు.

Also  Read:సరిపోదా శనివారం అంటున్న నేచురల్ స్టార్

అల్లు అర్జున్ మొదటి సినిమా చేస్తున్నప్పుడు.. అతడి కళ్లల్లో ఆకలిని చూశానని.. గంగోత్రి సినిమా షూటింగ్ వేళ.. అతడి నటనను చూసి.. ‘దిస్ బోయ్ విల్ గ్రో’ అని తాను అన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. నేను బన్నీలో ఆకలిని చూశాను. బన్నీ ఈ రోజు ఉన్న చాలామంది యూత్ కు ఒక ఉదాహరణగా నిలిచారు. నీలో సంకల్పం ఉంటే.. నీ కళ్ల ముందు కళలు ఉంటే.. నువ్వు ధైర్యంగా కష్టపడితేనే పురస్కారాలు వస్తాయి. బన్నీకి జాతీయ అవార్డు వస్తే.. నా బిడ్డకు వచ్చినట్లుగా భావిస్తున్నా అన్నారు ప్రకాష్ రాజ్.

తనకు తొలిసారి జాతీయ అవార్డు వచ్చినప్పుడు.. దాన్ని అందుకోవడానికి వెళ్లిన వేళలో.. తెలుగు సినిమా అంటే అక్కడి వారు తక్కువగా చూసేవారని.. ప్రస్తుతం జాతీయ ఉత్తమ నటుడి అవార్డుతో పాటు, జాతీయ ఉత్తమ సంగీత దర్శకుడి అవార్డు తెలుగు వారికి రావటం గర్వంగా ఉందన్నారు. మనకు అవార్డు వస్తేనే కాదు. మనవాళ్లకు అవార్డులు వచ్చినా మనకు వచ్చినట్లే. ఇక్కడికి చాలామంది యువ దర్శకులు వచ్చారు. కానీ.. ఇక్కడకు సినిమా పెద్దలు ఎందుకు రాలేదు? మన సినిమాలతో బౌండరీస్ దాటేస్తున్న వేళ.. అవతలి వాళ్ల కంటే మనవాళ్లను మనం గౌరవించుకోకపోతే ఎలా? అంటూ ప్రకాశ్ రాజ్ మండిపడ్డారు.

Advertisment
తాజా కథనాలు