Prajwal Revanna : నేను ఇండియాకు వస్తున్నా : ప్రజ్వల్‌ రేవణ్ణ

లైంగిక దౌర్జన్యం కేసులో ఆరోపణలుల ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరవుతానని తెలిపారు.

Prajwal Revanna : నేను ఇండియాకు వస్తున్నా : ప్రజ్వల్‌ రేవణ్ణ
New Update

Prajwal Revanna Is Coming To India : కర్ణాటక (Karnataka) లో ఇటీవల సంచలనం రేపిన సెక్స్‌ స్కాండల్‌ కేసు (Sex Scandal Case) లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందులో ఆరోపణలుల ఎదుర్కొంటున్న హసన్ ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ.. ఈ వ్యవహారంపై తొలిసారిగా స్పందించారు. ఈ నెల 31న ఉదయం 10.00 గంటలకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ముందు హాజరవుతానని తెలిపారు. ఇందుకు సంబంధించి ఆయన మాట్లాడిన వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ఇందులో మాట్లాడుతూ.. ' ఈనెల 31న సిట్‌ ముందుకు వస్తాను. నాపై తప్పుడు కేసులు పెట్టారు. అవి రాజకీయ కుట్రలో భాగంగానే వచ్చినవే. జేడీఎస్ నేతలు, కార్యకర్తలకు క్షమాణలు' అంటూ వివరించారు.

Also read: రేవంత్ రెడ్డి మైండ్ గేమ్.. ఆ క్రెడిట్ కేసీఆర్ కు దక్కకుండా చేసేందుకు బిగ్ ప్లాన్!

ఇదిలాఉండగా.. ఇటీవల కర్ణాటకలో ప్రజ్వల్‌ రేవణ్ణ (Prajwal Revanna) కు సంబంధించి పెన్‌ డ్రైవ్ వ్యవహారం పెనుదుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం బయటపడగానే ప్రజ్వల్‌ విదేశాలకు పారిపోయాడు. ప్రజ్వల్‌తో పాటు అతని తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై విచారణ జరిపేందుకు కర్ణాటక ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అతడిని రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ప్రజ్వల్ ఇంకా ఇండియాకు రాలేదు. దీంతో జేడీఎస్, మాజీ ప్రధాని హెచ్‌ డీ దేవగౌడపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

ఇటీవలే హెచ్‌డీ దేవగౌడ.. తన మనుమడు ప్రజ్వల్‌కు ఎక్స్‌ వేదికగా లేఖ రాశారు. ఎక్కడున్నా వెంటనే ఇండియాకు తిరిగి రావాలని.. తన సహనాన్ని ఇక పరీక్షంచకూడదంటూ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రజ్వల్ రేవణ్ణ దీనిపై తొలిసారిగా స్పందించారు. మే 31న సిట్ ముందుకు హాజరవుతానని స్పష్టం చేశారు.

Also read: పిన్నెల్లికి ఊరట.. ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు

#telugu-news #national-news #prajwal-revanna #sit
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe