Name Changed As Prajavani : తెలంగాణ(Telangana) లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రగతి భవన్‌ను జ్యోతిబా పూలే ప్రజా భవన్‌గా పేరుమార్చి అందులో ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నారు. సీఎంగా ఈనెల 7న రేవంత్ రెడ్డి(Revanth Reddy) ప్రమాణస్వీకారం చేశారు. ఆ మర్నాటి నుంచి ప్రజా దర్బార్ నిర్వహించడం మొదలుపెట్టారు. దీనికి ప్రజల నుంచి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. రోజుకు వందల సంఖ్యలో జనాలు వెళ్ళి తమ బాధలను చెప్పుకుంటున్నారు. అయితే తాజాగా దీని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి. పేరు, టైమింగ్స్ మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Also read:గ్రే హౌండ్స్, ఆక్టోపస్ మాదిరిగా యాంటీ నార్కొటిక్బ్యూరో.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు
ప్రజా దర్బార్ పేరును ప్రజావాణి(Prajavani) గా మార్చారు. అంతేకాదు ఇక మీదట దీన్ని కేవలం ప్రతీ మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు. ఆ రెండు రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. ఉదయం 10 గంటల లోపు ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి ప్రాధాన్యమివ్వాలని సీఎం ఆదేశించారు. దివ్యాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని.. ప్రజావాణికి వచ్చేవారి సౌకర్యార్థం తాగునీరు, ఇతర మౌలిక సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఇప్పటివరకు ప్రజా దర్బార్ లో దాదాపు 5వేల దరఖాస్తులను స్వీకరించారు. ఇందులో ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వాటి నిర్మాణం, పెన్షన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.