PM Kisan Yojana: రైతులకు అలర్ట్.. 15వ విడత కిసాన్ నిధులు పడాలంటే ఈ పనులు చేయాల్సిందే..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే.

New Update
PM Kisan Yojana: రైతులకు మోదీ సర్కార్ షాక్.. పీఎం కిసాన్ పై కేంద్ర మంత్రి కీలక ప్రకటన!

PM Kisan Samman Nidhi 15th Installment:వ్యవసాయానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నాయి. ఈ పథకాల ద్వారా రైతులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చడం, వ్యవసాయానికి సహాయం అందించడం, విత్తనాలు, ఇతర సౌకర్యాలను అందించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే రైతులకు ఉపయోగకరంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను(PM Kisan Samman Nidhi)అమలు చేస్తుంది. ఇప్పటికే 14 విడతలుగా నిధులు రైతులు(Farmers) ఖాతాల్లో జమ అవగా.. 15వ విడత నిధులు విడుదలకు ప్రభుత్వం సిద్ధమైంది. జులై 27వ తేదీన రైతుల ఖాతాల్లో 14వ విడతకు సంబంధించిన నిధులు పడ్డాయి. ఇప్పుడు రైతులందరూ 15వ విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ విడత అంటే, 15వ విడత నిధులు పడాలంటే.. రైతులు కొన్ని ముఖ్యమైన పనులు చేయాల్సి ఉంటుంది. అవి పూర్తి చేస్తేనే వారి ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు పడతాయి. లేదంటే.. ఆ నిధులు నిలిచిపోతాయి. అందుకే లబ్దిదారులైన రైతులు తప్పనిసరిగా ఈ 3 పనులు చేయాలని చెబుతున్నారు అదికారులు. మరి ఆ 3 కీలక అంశాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

నిధుల విడుదల ఇలా..

ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కింద అర్హులైన రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2 వేలు చొప్పన ఏడాదికి మొత్తం రూ. 6 వేలు కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ప్రతి ఏటా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసే పథకాన్ని ఫిబ్రివరి 14, 2019లో ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం 14 దఫాలుగా రైతుల ఖాతాల్లో నిధులు జమ చేస్తోంది. అయితే, 15వ విడత నిధులు పొందాలంటే రైతులు ఈ పనులు తప్పక చేయాల్సిందే. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Also Read: Chandrayaan-3: విక్రమ్ ల్యాండర్ మరోసారి సాఫ్ట్ ల్యాండింగ్.. ఇస్రో అరుదైన ఘనత

ఆ మూడు పనులు ఇవే..

1. మీ ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకుంటున్నా.. లేక ఇప్పటికే లబ్దిదారులైతే.. మీ భూమి పత్రాలకు సంబంధించిన వివరాలను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పోర్టల్‌లో అప్‌లోడ్ చేయాలి. ఈ పనిని ఎంత త్వరగా పూర్తి చేస్తే అంత మంచిది. లేదంటే మీకు రావాల్సిన నిధులు నిలిచిపోతాయి.

2. పీఎం కిసాన్ యోజన పథకం కింద ప్రతి లబ్ధిదారుడు e-KVEC ని తప్పనిసరిగా పూర్తి చేయాలి. దీన్ని పూర్తి చేయకపోతే.. ఈ ప్రభుత్వ పథకానికి సంబంధించి నిధులను పొందలేరు. అందుకే.. ఈ స్కీమ్ పోర్టల్‌ pmkisan.gov.in ని సందర్శించడం ద్వారా గానీ, మీ సమీపంలోని CSC కేంద్రాన్ని సందర్శించడం ద్వారా గానీ, లేదంటే బ్యాంక్ ద్వారా గానీ e-KYC ని పూర్తి చేయాలి.

3. మరో కీలక అంశం, చివరి అంశం ఏంటంటే.. పీఎం కిసాన్ యోజనకు అర్హులైన లబ్ధిదారులు.. తమ ఆధార్ కార్డును రన్నింగ్‌లో ఉన్న బ్యాంక్ అకౌంట్‌తో లింక్ తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయని రైతులు పీఎం కిసాన్ యోజన నిధులను పొందలేరు. అందుకే, రైతులు తమ పనులను పూర్తి చేస్తేనే ఈ పథకానికి సంబంధించిన నిధులను పొందగలుగుతారు.

Also Read: Udhayanidhi Remarks row: స్టాలిన్‌ సనాతన ధర్మపై ఆగని మాటల మంటలు.. పొలిటికల్‌ రియాక్షన్స్‌ ఇవే!

Advertisment
తాజా కథనాలు