Salaar: నెల రోజుల ముందే సలార్ కలెక్షన్ల బాదుడు మొదలయ్యింది.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోతున్న బిగ్గెస్ట్ హై వోల్టేజ్ యాక్షన్ మూవీ సలార్.దీని మీద అంచాలు చాలా హైగా ఉన్నాయి. డిసెంబర్ 22న రిలీజ్ అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మొదలవ్వడమే కాక దుమ్ములేపుతున్నాయి కూడా. By Manogna alamuru 17 Nov 2023 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Salaar Movie: ప్రశాంత్ నీల్ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కేజీఎఫ్తో (KGF) అతనో సంచలన డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పడు అతని దర్శకత్వంలో వస్తున్న సలార్ సినిమా టీజర్ తోనే హైరేంజ్ కు వెళ్ళిపోయింది. ఎప్పటి నుంచో ఈ సినిమా కోసం ప్రభాస్ (Prabhas) అభిమానులు ఆవగా ఎదురుచూస్తున్నారు. ఇందులో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రలలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఈ సినిమా విదేశాల్లో కూడా మంచి క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. యుఎస్ లో కూడా సినిమాను గ్రాండ్ గా విడుదల చేస్తున్నారు. అక్కడా, ఇక్కడ కూడా సలార్ ఫస్ట్ షో చూసేందుకు అందరూ ఆతృతగా వెయిట్ చేస్తున్నారు. Also Read:ఇండియా కప్ గెలవాలంటే..ఆ మొనగాడే ముఖ్యం యూఎస్ లో సినిమాకు సంబంధించిన బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇండియాలో కంటే అమెరికాలో ఒక రోజు ముందు నుంచి సలార్ ప్రీమియర్స్ స్టార్ట్ కానున్నాయి. ఇక్కడ కొన్ని లొకేషన్స్ లలో సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. సినిమా రిలీజ్ కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ టికెట్లు అప్పుడే హాట్ కేకుల్లా అమ్ముడు పోతున్నాయి. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 25k డాలర్స్ ను రాబట్టినట్లు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో అన్ని లొకేషన్స్ లలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ నవంబర్ 20 నుంచి ఓపెన్ కానున్నాయి. కేవలం కొన్ని లొకేషన్స్ లలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాగా ఒక రేంజ్ లో రెస్పాన్స్ వస్తోంటే...అన్ని లోకేషన్స్ లో ఓపెన్ చేస్తే సునామీనే అంటున్నారు సినీ ట్రేడ్ పండితులు. సినిమా విడుదల సమయానికి హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమివ్వడం పక్కా అని చెబుతున్నారు. సలార్ సినిమాలో శృతి హాసన్ (Shruthi Haasan) హీరోయిన్ గా నటించగా పృథ్వీరాజ్ సుకుమార్ ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. జగపతిబాబు కూడా ఇందులో ఒక నెగిటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. బాహుబలి తర్వాతసాలిడ్ హిట్ లేక ఇబ్బందులు పడుతున్న ప్రబాస్ సలార్ తో అయినా కమ్ బ్యాక్ ఇస్తాడో లేదో చూడాలి. #prabhas #salaar #prabhas-salaar-movie మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి