బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం.. టీమ్ కు కోట్లలో రెమ్యూనరేషన్!

'సలార్' మూవీకి ప్రభాస్ రూ.100 కోట్ల రెమ్యునరేషన్ తోపాటు లాభాల్లో 10శాతం వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌ రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతిబాబు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం.

New Update
బాక్సాఫీస్ వద్ద 'సలార్' ప్రభంజనం.. టీమ్ కు కోట్లలో రెమ్యూనరేషన్!

Prabhas : డార్లింగ్ ప్రభాస్ 'సలార్'(Salaar) దెబ్బకు బాక్సాఫీస్ పునాదులు కదులుతున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ఈ మూవీ డిసెంబర్ 22న విడుదలవగా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు రాబడుతోంది. తొలిరోజే రూ.70 కోట్లను కలెక్ట్ చేసిన సినిమా రెండో రోజు ఏకంగా రూ.170 కోట్లకుపైగానే రాబట్టింది. ఈ క్రమంలో టీమ్ పై ప్రశంసలు కురుస్తుండగా.. నిర్మాతలు సైతం ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఊహించని స్థాయిలో లాభాలు రావడంతో నటీనటులకు భారీ రెమ్యునరేషన్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

'బాహుబలి' సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన ప్రభాస్(Prabhas).. తన రెమ్యునరేషన్ కూడా అమాంతం పెంచేశాడు. 'సలార్' మూవీకి ఆయన రూ.100 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీ లాభాల్లోనూ 10 శాతం షేర్ తీసుకున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి దాదాపు రూ. 50 కోట్లు, శృతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్-జగపతిబాబుతోపాటు పలువురు రూ.4 కోట్లకు పైగానే పారితోషికం అందుకోబోతున్నట్లు సమాచారం. ఇక ఈ మూవీ బడ్జెట్ మొత్తం రూ. 400 కోట్ల వరకు ఉంటుందని టాక్. అంటే ఓవరాల్ బడ్జెట్‌లో సగం రెమ్యునరేషన్స్‌కే నిర్మాతలు ఖర్చు చేసినట్లు కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి : ఆ సమయంలో అర్ధరాత్రి ఒంటరిగా తిరిగేదాన్ని.. కత్రినా కైఫ్‌

ఇదిలావుంటే.. 'కేజీఎఫ్' లాంటి సినిమాతో దేశం మొత్తం తనవైపు చూసేలా చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. ప్రభాస్‌తో ఊరమాస్ సినిమా తీశాడు. 'సలార్' అనౌన్స్‌మెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ సినిమాపై హైప్ మాములుగా లేదు. మధ్యలో వాయిదాల వల్ల ఫ్యాన్స్ కాస్త డిసప్పాయింట్ అయిన మాట నిజమే. కానీ ఇప్పుడు థియేటర్లలోకి మూవీ వచ్చేసిన తర్వాత అవన్నీ మరిచిపోయి ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు