Raja Saab : ప్రభాస్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్.. మరింత ఆలస్యంగా 'రాజా సాబ్' వచ్చే నెల నుంచి ప్రభాస్ 'సలార్ 2' షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలిసింది. అతనితో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ఇతర నటులందరితో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సినీ వర్గాల సమాచారం. By Anil Kumar 12 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Prabhas Raja Saab : మారుతి(Maruthi) దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'(Raja Saab). పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలు పెంచడంతో డార్లింగ్ ఫ్యాన్స్ ఈ సినిమాని థియేటర్స్ లో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఫ్యాన్స్ కి ఓ బ్యాడ్ న్యూస్. 'రాజా సాబ్' మరింత ఆలస్యం కానున్నట్లు తాజా సమాచారం బయటికి వచ్చింది. మరింత ఆలస్యంగా 'రాజా సాబ్' ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. రీసెంట్ గా 'కల్కి' షూటింగ్ పూర్తి చేయగా.. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఇక రెండు రోజుల క్రితం 'కన్నప్ప' సెట్స్ లో అడుగుపెట్టాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్ లో ప్రభాస్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. Also Read : కాబోయే భర్తలో ఆ క్వాలిటీస్ ఉండాలంటున్న ‘ఆదిపురుష్’ బ్యూటీ! దీని తర్వాత 'సలార్ 2' కి ఇంకొంత సమయం పడుతుందని, ఈలోగా 'రాజాసాబ్' కి సంబంధించి కొత్త షెడ్యూల్ లో ప్రభాస్ పాల్గొంటారని ఇటీవల వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం.. ప్రశాంత్ నీల్ 'సలార్ 2' ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ చేసిన ఆయన.. ఇదే నెలలో జరిగే షెడ్యూల్ లో ప్రభాస్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారట. వచ్చే నెల నుంచి ప్రభాస్ 'సలార్ 2' షూటింగ్ లో జాయిన్ కానున్నట్లు తెలిసింది. అతనితో పాటు పృథ్విరాజ్ సుకుమారన్, ఇతర నటులందరితో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్టు తెలుస్తోంది.. దీంతో 'రాజా సాబ్' షూటింగ్ మరింత ఆలస్యం కానుందని సినీ వర్గాల సమాచారం. #tollywood #prabhas #raja-saab #director-maruthi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి