Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్

Siddu Jonnalagadda Tillu Square:టిల్లు స్క్వేర్ ను ఎగరేసుకుపోయిన ఈగల్
New Update

Siddu Jonnalagadda Tillu Square:డీజే టిల్లు మూవీ సిద్ధూ జొన్నలగడ్డకు టర్నింగ్ పాయింట్.ఈ మూవీ లో సిద్ధూ యాక్టింగ్ ,డైలాగ్ డెలివరీ వేరే లెవెల్ లో ఉంటాయి. ఇంతటి బ్లాక్ బస్టర్ సినిమాకు సీక్వెల్ అంటే ఆడియన్స్ ఎంత క్యూరియాసిటితో ఎదురు చూస్తారు చెప్పండి. టిల్లు స్క్వేర్ అంటూ సీక్వెల్ గా తెరకెక్కబోతోన్న ఈ మూవీ హీరోయిన్ సెలక్షన్ విషయంలో కొంత లేటయ్యింది. తీరా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది అనుకుంటే ఆల్రెడీ ఒకసారి పోస్ట్ పోన్ అయింది . ఈ మూవీ ఫిబ్రవరి 9 న రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేశారు.

సోలో రిలీజ్ సో బెటరు

ఓకే అంతా బాగానే ఉంది. ఆ డేట్ న పెద్ద సినిమాలు లేవు.కాబట్టి సోలో రిలీజ్ సో బెటరు అనుకున్నారు. అసలు కథ ఇక్కడే మొదలయింది. సంక్రాంతి రేసు నుండి తప్పుకున్న రవితేజ ఈగల్ మూవీ ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఓకే..రెండు సినిమాలే కదా. జనాలు రెండిటినీ ఎంజాయ్ చేస్తారులే అని అనుకుంటున్న తరుణంలో దిల్ రాజు ఈగల్ మూవీ పై వరాలు కురిపించారు. సంక్రాంతి నుంచి తప్పుకున్న సినిమా కు సోలో రిలీజ్ డేట్ ఇస్తా అని. ఇక్కడే వచ్చింది అసలు చిక్కంతా. ఆ మూవీ సోలో రిలీజ్ చేస్తే డీజే టిల్లు స్క్వేర్ పరిస్థితి ఏంటి?అనేది ఇప్పుడు మిలియన్ డాలర్స్ ప్రశ్న. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ మూవీ ఎట్టకేలకు ఫెబ్ 9 రిలీజ్ డేట్ ఫిక్స్ చేస్తే ఈగల్ వచ్చి ఎగరేసుకుపోయినట్టయింది. ఇప్పటికే రిలీజ్ అయిన సిద్ధు- అనుపమ పరమేశ్వరన్ స్టిల్స్ హీట్ పుట్టిస్తున్నాయి.

ALSO READ:HANU- MAN RELEASE: హను- మాన్ రిలీజ్ అవుతుందా ? పోస్ట్ పోన్ అవుతుందా ?

ముచ్చటగా మూడు సార్లు వాయిదా
నిజానికి ఈ సినిమా షూటింగ్ 2022 ఆగష్టు లో స్టార్ట్ అయింది.మెరుపు వేగంతో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2023లో రిలీజ్ చెయ్యాలని అనౌన్స్ చేశారు. కొన్ని కారణాల వల్ల రిలీజ్ డేట్‌ను నవంబర్ 2023కి మార్చడం జరిగింది. ఇక..మూవీకి తుది మెరుగులు దిద్దే పని పెట్టుకుని ఎట్టకేలకు 2024 ఫిబ్రవరి 9 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు.అయినా ఈగల్‌ రూపంలో మళ్ళీ పోస్ట్ పోన్ అయింది.

నిరాశ పడిన ఫ్యాన్స్

నిర్మాత దిల్ రాజు ఈగల్ టీమ్ కు ఇచ్చిన మాట ప్రకారం సోలో రిలీజ్ తప్పని సరిగా చెయ్యాలి. ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ నిర్మాతను ఒప్పించి మరీ వాయిదా కన్ఫర్మ్ చేశారు.ఈ విషయం అధికారికంగా తెలియడంతో సిద్ధూ ఫ్యాన్స్ కాస్త నిరాశ పడిన మాట వాస్తవమే. కొత్త రిలీజ్ డేట్ కోసం అటు అనుపమ పరమేశ్వరన్ ఫ్యాన్స్, ఇటు సిద్ధూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు.ముచ్చటగా మూడో సారి వాయిదా పడిన టిల్లు స్క్వేర్ ఈ సారైనా సరైన డేట్ ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారని ఎదురుచూస్తున్నారు అభిమానులు.సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు.

ALSO READ:Trivikram Srinivas : దర్శకుడు త్రివిక్రమ్ కు కలిసొచ్చిన కాపీ కథలు

#tillu-square #siddu-jonnalagadda-tillu-square #siddu-jonnalagadda #ravi-teja #eagle-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి