Election Poling : ప్రస్తుతం దేశంలో ఎన్నికలు(Elections) జరుగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్(Poling) నిర్వహిస్తున్నారు. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిశాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఒకేసారి జరగనుండగా..తెలంగాణ(Telangana) లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే వీటికి ఎండల తీవ్రత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు అన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్ళాయి. ఈసీ(EC) కి కూడా నివేదించాయి. అన్ని అంశాల అంశాలను పరిశీలించిన ఎన్నికల సంఘం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.
ఈసీ నిర్ణయం ప్రకారం మే 13న తెలంగాణలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 6 గంటల లోపు క్యూలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. 13న పోలింగ్ జరగనున్నందున.. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా పోలింగ్ సమయాన్ని 6 గంటల వరకు పొడిగించాలని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఈసీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం సానుకూల నిర్ణయం తీసుకుంది. అయితే నక్సల్స్ ప్రభావిత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్‌కు అనుమతించారు.
Also Read : ఆదిలాబాద్ లో గెలిచేది ఎవరు.. రవిప్రకాశ్ ఏం చెబుతున్నారంటే!