Election Poling : ప్రస్తుతం దేశంలో ఎన్నికలు(Elections) జరుగుతున్నాయి. మొత్తం 7 దశల్లో పోలింగ్(Poling) నిర్వహిస్తున్నారు. ఇప్పటికి రెండు దశల పోలింగ్ ముగిశాయి. మే 13న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్ ఒకేసారి జరగనుండగా..తెలంగాణ(Telangana) లో లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే వీటికి ఎండల తీవ్రత ఓటింగ్‌పై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రాజకీయ పార్టీలు అన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా తీసుకెళ్ళాయి. ఈసీ(EC) కి కూడా నివేదించాయి. అన్ని అంశాల అంశాలను పరిశీలించిన ఎన్నికల సంఘం తెలంగాణలో పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకుంది.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణలో పోలింగ్ సమయం పెంపు
మే 13న తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉంటుంది. కానీ మండుతున్న ఎండల కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచి సాయంత్రం 6గంటలకు వరకు పెంచారు.
Translate this News: