Elections:మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ లలో పోలింగ్ ప్రారంభం

మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్‌లలో పోలింగ్ మొదలైంది. మధ్యప్రదేశ్ లో 230 స్థానాలకు, ఛత్తీస్ ఘడ్ లో రెండో విడతలో 70 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు.

New Update
West Bengal: మధురాపూర్, బరాసత్‌లో రీపోలింగ్-ఈసీ ఆదేశం

రెండు రాష్ట్రాల్లో ఉదయం 8గంటల నుంచి పోలింగ్ ప్రారంభం అయింది. ఇది సాయంత్రం 5 వరకు కొనసాగనుంది. మధ్యప్రదేశ్ లో ప్రధానంగా బీజెపీ, కాంగ్రెస్ ల మధ్యనే పోటీ ఉంది. మధ్యప్రదేశ్ లో 5.6 కోట్ల మంది ఓటు హక్కును కలిగి ఉన్నారు. ఇందులో 22.36మంది మొదటి సారిగా తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక్కడ మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు పోటీ జరుగుతోంది. ఇక్కడ ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్సే అని దాదాపు ఎన్నికల సర్వేలు తేల్చేశాయి.

మరోవైపు ఛత్తీస్ ఘడ్ లో ఇప్పుడు రెండో విడత పోలింగ్ జరుగుతోంది. నవంబర్ 7న మొదటి విడతగా 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ అయిపోయింది. ఇప్పుడ మరో 70 సీట్లకు రేపు పోలింగ్ జరగనుంది. రెండో విడతలో మొత్తం 958 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మొత్తం 1.63 కోట్ల ఓటర్లు రేపు వీరి భవితవ్యం తేల్చనున్నారు. అధికారాన్ని కాపాడుకునేందుకు కాంగ్రెస్‌ తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. కానీ బీజేపీ మాత్రం అధికార పార్టీపై తీవ్ర విమర్శలు, అవినీతి ఆరోపణలతో తన ప్రచారాన్ని చేసింది.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్నారు. ఉదయాన్నే పోలింగ్‌ కేంద్రాల వద్ద సందడి నెలకొంది. ఓటు వేసేందుకు ఓటర్లు ఉదయాన్నే వచ్చి నిలుచున్నారు.

ఛత్తీస్ ఘడ్ లో రాష్ట్రంలో మిగిలిన 70 స్థానాల్లో పోలింగ్‌ జరుగుతోంది. ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బఘేల్ మాట్లాడుతూ మీరు వేసే ఒక్క ఓటు.. రాష్ట్రంలో రైతులు, యూత్‌, మహిళల భవిష్యత్త్‌కు ఉపయోగపడుతుంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఓటు వేయండి. ఛత్తీస్‌గఢ్‌ బంగారు భవిష్యత్త్‌ కోసం ఓటు వేయండి అంటూ పిలుపునిచ్చారు.

Advertisment
తాజా కథనాలు