Lok Sabha Elections : బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన యోగేంద్ర యాదవ్

ప్రస్తుతం రాజకీయ నేతగా మారిన మరో సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు. బీజేపీ 240 నుంచి 260 స్థానాల్లో గెలుస్తుందని.. కాంగ్రెస్‌కు 100కు పైగా సీట్లు వస్తాయని అంచనా వేశారు.

New Update
Lok Sabha Elections : బీజేపీ, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లు వస్తాయో చెప్పిన యోగేంద్ర యాదవ్

BJP - Congress : లోక్‌సభ ఎన్నికలు (Lok Sabha Elections) కొనసాగుతున్నాయి. ఈరోజు (శనివారం) ఆరో దశ ఎన్నికలు (Sixth Phase Polling) జరుగుతున్న సంగతి తెలిసిందే. జూన్‌ 1న జరిగే ఏడో దశ ఎన్నికలతో.. లోక్‌సభ ఎన్నికలు పూర్తవుతాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. అయితే ఈసారి ఎవరు కేంద్రంలో అధికారంలోకి వస్తారనేది దేశవ్యాప్తంగా సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తుందని.. ఇప్పటికే ప్రముఖ సెఫాలజిస్ట్ ప్రశాంత్ కిషోర్, అమెరికా పోల్‌ ఎక్స్‌పర్ట్ ఐయాన్ బ్రెమెర్ తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం రాజకీయ నేతగా మారిన మరో సెఫాలజిస్ట్‌ యోగేంద్ర యాదవ్ కూడా ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారు.

Also Read: యూపీలో పార్టీల హార్ట్ బీట్ పెంచుతున్న ఆ సీట్లు.. తేడా వస్తే అంతే!

బీజేపీ అధికారంలోకి రాబోతుందని అన్నారు. కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో 100కు పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని అంచనా వేశారు. ఇక బీజేపీ 240 నుంచి 260 స్థానాల్లో గెలుస్తుందని.. దాని మిత్రపక్షాలు మరో 35 నుంచి 45 సీట్లు గెలుచుకుంటాయని అన్నారు. ఎన్డీయే కూటమి మొత్తం 275 నుంచి 305 సీట్లు సాధిస్తుందని.. దీంతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్ 85 నుంచి 100 స్థానాలు దాటుతుందని చెప్పారు. అయితే యోగేంద్ర (Yogendra Yadav) చెబుతున్న విశ్లేషనను బట్టి చూస్తే.. బీజేపీ ఎక్కువగా సీట్లు కోల్పోనుంది. అంటే దాదాపు 120 నుంచి 135 వరకు స్థానాలు తగ్గే అవకాశం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ 52 ఎంపీ స్థానాల్లో గెలిచింది. యోగేంద్ర చెప్పిన దాని ప్రకారం వీటి సంఖ్య డబుల్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లు కనిపిస్తుంది. ఇక జూన్ 1న ఎగ్జిట్‌ ఫలితాలు రాబోతున్నాయి. ముందుగా వీటికోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈసారి కేంద్రంలో ఎవరు అధికారంలో వస్తారో తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.

Also Read: ఇది సినిమా కాదు రియల్.. ఇలాంటి గ్యాంగ్ వార్ ఎక్కడా చూసి ఉండరు.. 

Advertisment
Advertisment
తాజా కథనాలు