మంత్రి ఉత్తమ్ ఇంట్లో విషాదం!
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తంరెడ్డి ఈ రోజు అనారోగ్యంతో చనిపోయారు. సాయంత్రం హైదరాబాద్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
లులూ గ్రూప్ ఇంటర్నేషనల్ ఛైర్మన్ అండ్ ఎండీ యూసఫ్ అలీ.. ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. చంద్రబాబును కలిసిన లులూ గ్రూప్ ప్రతినిధులు ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు ఎక్స్ వేదికగా తెలియజేశారు.
కేటీఆర్ మిత్రుడికి చెందిన జన్వాడ ఫామ్ హౌజ్ తమ పరిధిలోకి రాదని హైడ్రా చీఫ్ రంగనాథ్ స్పష్టం చేశారు. జన్వాడలో అక్రమాలపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. అక్రమ నిర్మాణాలు చేసిన పెద్దలెవరినీ వదిలి పెట్టేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
దేశ వాణిజ్య రాజధాని ముంబైకి ఉగ్రముప్పు పొంచి ఉన్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో నగర పోలీసులు అప్రమత్తమయ్యారు. ముంబై వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
TG: మూసీలో ఇళ్ల సర్వేపై హైడ్రా కమిషనర్ కీలక ప్రకటన చేశారు. మూసీలో సర్వేకు, హైడ్రాకు సంబంధం లేదని స్పష్టం చేశారు. మూసీలో కూల్చివేతలు ఉంటాయని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసీలో ఇప్పటి వరకు ఎవరికీ హైడ్రా నోటీసులు ఇవ్వలేదన్నారు.
TG: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు హైదరాబాద్‌కు రానున్నారు. ఉదయం నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా స్నాతకోత్సవానికి హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం నామినేట్ చేసింది.
నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరు పోలీసులను చట్టసభ ప్రతినిధుల న్యాయస్థానం ఆదేశించింది. ఎన్నికల బాండ్ల పేరిట పలువురు వ్యాపారవేత్తలను బెదిరించి బీజేపీకి నిధులు వచ్చేలా చేశారని దాఖలైన పిటిషన్ విచారించిన ధర్మాసనం ఈ తీర్పు ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టింది. రాష్ట్రంలోని పర్ఆటక ప్రాంతాలను చారిత్రక కట్టడాలను విద్యార్థులు తెలంగాణ దర్శిని అనే పథకం ద్వారా ఉచితం సందర్శించే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు రేవంత్ తెలిపారు.
బీసీల కోసమే తాను రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశానని ఆర్ కృష్ణయ్య స్పష్టం చేశారు. జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ పదవి ఇస్తే తీసుకుంటానన్నారు. పార్టీలో చేరాలని బీజేపీ నేతలు తనను సంప్రదించలేదన్నారు. RTVకి ఆయన ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూను ఈ వీడియోలో చూడండి.