/rtv/media/media_files/eysvyEEYJpY4e7DSAK6I.jpg)
Droupadi Murmu: ఈరోజు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి వస్తున్న ఆమె ఉదయం 11:50కి హకీంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు. మధ్యాహ్నం 12:20 గంటలకు నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 21వ స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఎనిమిది రోజులపాటు నిర్వహించే ఈశాన్య రాష్ట్రాల భారతీయ కళా మహోత్సవంను ప్రారంభించనున్నారు.
రాష్ట్రపతితో సీతక్క..
రాష్ట్రపతి పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నిక చేసింది. రాష్ట్రపతిని స్వాగతించడం మొదలు సాగనంపడం వరకు ఆమె వెంట సీతక్క ఉండనున్నారు. సాయంత్రం 5:45 నిమిషాలకు ఆమె తిరిగి హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక వినమంలో ఢిల్లీకి వెళ్లనున్నారు.
Also Read: కూల్చివేతల భయంతో మహిళ ఆత్మహత్య..సంబంధం లేదంటున్న రంగనాథ్!
Follow Us