సీఎం రేవంత్ రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫార్మా సిటీ రద్దు చేస్తానని చెప్పిన కాంగ్రెస్ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా కొడంగల్‌లో ఫార్మాను ఏర్పాటు చేస్తున్నారన్నారు. ముచ్చర్లలో ఫార్మా సిటీ భూసేకరణ సమయంలో రేవంత్ మాటలు మాట్లాడిన మాటలకు అసలు హద్దే లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఫార్మా సిటీని రద్దు చేస్తామని తన మేనిఫేస్టోలో పేర్కొంది. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని ఈటల అన్నారు.
ఇది కూడా చూడండి: గుండెలను పిండేసే దృశ్యం.. ఆరేళ్ళ తర్వాత అనాథాశ్రమంలో తండ్రి..! కూతుర్లు ఏం చేశారో చూడండి
ఫార్మా బాధితులను హింసించారని..
వందల కోట్లు పెట్టి ఇప్పుడు యాడ్స్ ఇస్తున్నారని, వీటిని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఈటల వ్యాఖ్యానించారు. తెలంగాణలో ప్రతి 10 మందిలో 7 మంది దృష్టిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. పోలీసులు ముసుగులు కట్టుకొని ఫార్మా సిటీ బాధితులను హింసించారని, రేవంత్ శాడిస్ట్‌లా వ్యవహరిస్తున్నాడన్నారు.
ఇది కూడా చూడండి: సుకుమార్ సపోర్ట్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ కే.. పుష్ప2 BGMపై సంచలన నిర్ణయం!
అసలు రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రాంతానికి చెందిన వాడే కాదు.. కానీ ప్రజలు అతన్ని ఆదరించారు. ఇంత ఆదరణ ప్రజలు చూపించినందుకు రేవంత్ తగిన బుద్ధి చెబుతున్నారన్నారు. అలాగే రేవంత్ రెడ్డి నీ బతుకెంతా.. మోదీపై విమర్శలు చేసేంత వాడివా.. అంటూ ఈటల మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: AP Crime: ముసలోడికి ఇదేం మాయరోగం..11 ఏళ్ల అమ్మాయిని అలా చేస్తాడా..!
ఇదిలా ఉండగా.. లగచర్లలో కలెక్టర్‌పై దాడి ఘటనలో అరెస్టయిన రైతులను సంగారెడ్డి జైలులో ఈటల రాజేందర్ కలిసి పరామర్శించారు. అనంతరం నిర్వాసితులను పరామర్శించడానికి లగచర్లకు బయలు దేరిన ఈటలను మొయినాబాద్ వద్ద పోలీసులు అడ్డుకుని అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలించి విడిచి పెట్టారు.
ఇది కూడా చూడండి: అవినాశ్ రెడ్డికి సుప్రీంకోర్టు బిగ్ షాక్.. వివేకా హత్య కేసులో మరో కీలక పరిణామం!