/rtv/media/media_files/2024/11/23/apABIhiVJU6CSWqMQHBz.jpg)
వైసీపీ మాజీ ఎమ్మెల్యే, బొత్స సత్యనారాయణ జనసేన పార్టీలోకి చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. నిన్న అసెంబ్లీ బయట బొత్స సత్యనారాయణను పవన్ కళ్యాణ్ ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్నారు. గత కొన్ని రోజుల నుంచి బొత్స పార్టీ మారుతారంటూ ప్రచారం జరిగింది. బొత్స పార్టీలోకి చేరడంపై పవన్ కూడా సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఏది ఏమైనా దీనిపైన బహిరంగ ప్రకటన వచ్చే వరకు పూర్తిగా తెలియదు.
ఇది కూడా చూడండి: TMC: బెంగాల్ ఉప ఎన్నికల్లో టీఎంసీ హవా.. బీజేపీ కంచుకోట బద్ధలు!
డిప్యూటీ సిఎం @PawanKalyan గారితో బొత్స @BotchaBSN కరాచలనం.
— VamsiKrishna Bandaru (@VKBandaru18) November 22, 2024
అటునుండి బిత్తర నడక నడుస్తూ వస్తున్న పుంగనూరు పూడింగ్ @peddireddyysrcp పెద్దిరెడ్డితో
What Is This Andi అని అసహనం వ్యక్తం చేసిన గుర్తు తెలియని వ్యక్తి.
మనసులో వంకాయ్ పుల్స్ అండి అనుకుంటూ జారుకున్న బిగ్ రెడ్డి 😀 pic.twitter.com/fToH4n9tLL
ఇది కూడా చూడండి: మహారాష్ట్ర కొత్త సీఎం ఎవరు.. తెరపైకి కొత్త పేరు?
జగన్‌కు వరుస షాక్‌లు..
ఇదిలా ఉండగా.. వైసీపీ నేతలు వరుసగా రాజీనామా చేసి కూటమి ప్రభుత్వంలో చేరుతున్నారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి కోలుకుంటున్న జగన్ కు.. సొంత పార్టీ నేతల రాజీనామాలు, చెల్లితో ఆస్థి వివాదం, అదానీ లంచం ఇచ్చినట్లు వచ్చిన వార్తలతో ఇబ్బందుల్లో ఎదుర్కొంటున్నారు.
ఇది కూడా చూడండి: హాయ్ .. హలో అంటూ ఫోన్ కాల్.. కట్ చేస్తే న్యూడ్ వీడియో!
ఇటీవల మరో కీలక నేత వైసీపీకి రాజీనామా చేశారు. కైకలూరుకు ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామా లేఖను శాసన మండలి ఛైర్మన్ మోసేనురాజుకు పంపించారు.
ఇది కూడా చూడండి: మహారాష్ట్రలో 'నితీష్ కుమార్' మోడల్.. సీఎం అభ్యర్థిపై బీజేపీ వ్యూహం ఇదేనా?