దువ్వాడ శ్రీనివాస్‌కు బిగ్ షాక్ తగిలింది. గతంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై అసభ్యకర వ్యాఖ్యలు చేసినందుకు దువ్వాడ శ్రీనివాస్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. టెక్కలి జనసేన నేత కిరణ్ కుమార్ దువ్వాడ శ్రీనివాస్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో టెక్కలి పోలీసులు కేసు నమోదు చేశారు. కేవలం పవన్ కళ్యాణ్‌పైనే కాకుండా అతని కుటుంబంపై కూడా దువ్వాడ శ్రీనివాస్ చాలా సార్లు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: వైసీపీ ఎమ్మెల్యేకు నోటీసులు
అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు..
ఇదిలా ఉండగా.. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌తో పాటు మరికొందరిపై వైసీపీ పార్టీ నాయకులు అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల పోసాని కృష్ణమురళిపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు, అసత్య ప్రచారం చేశారని రాష్ట్ర తెలుగు యువత ప్రతినిధి బండారు వంశీకృష్ణ సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. చంద్రబాబు వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా పోసాని వ్యాఖ్యలు ఉన్నాయని.. రెండు వర్గాల మధ్య గొడవలు వచ్చే విధంగా పోసాని మాట్లాడారన్నారని ఫిర్యాదు చేశారు.
ఇది కూడా చూడండి: కేజ్రీవాల్‌కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన కీలకనేత
పోసానిపై కేసు నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని వంశీకృష్ణ సీఐడీని కోరారు. దీంతో పోసాని మురళికృష్ణపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. బీఎన్‌ఎస్ యాక్ట్ 111, 196, 353, 299, 336(3)(4), 341, 61(2) సెక్షన్ల కింద సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. నేరం రుజువైతే మూడేళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇది కూడా చూడండి: BIG BREAKING: హైదరాబాద్‌లో ఐటీ దాడులు
అలాగే ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌కి పోలీసులు ఇటీవల నోటీసులు అందించారు. తాటిపర్తి చంద్రశేఖర్ గతంలో మంత్రి నారా లోకేష్‌పై ట్విట్టర్‌లో అనుచితవ్యాఖ్యలు చేశారని కొన్ని రోజుల కిందట కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన విషయంలో 41(A) క్రింద నోటీసులు చంద్రశేఖర్‌కి పోలీసులు నోటీసులు అందించారు.
ఇది కూడా చూడండి: అతి తక్కువ టైంలో లక్ష లైక్స్ అందుకున్న టాలీవుడ్ ట్రైలర్స్