రోడ్డెక్కిన రేవంత్ రెడ్డి.. మంత్రులు, కీలక నేతలతో కలిసి భారీ ర్యాలీ!

అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు.

New Update

టీపీసీసీ ఆధ్వర్యంలో చలో రాజ్‌భవన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదానీ, మణిపూర్ అంశాలపై ప్రధాని మోదీ మౌనం వహించడంపై కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా టీపీసీసీ చీఫ్‌ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఇందిరాపార్క్ నుంచి రాజ్‌ భవన్‌ వరకు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ర్యాలీలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో పాటు ఇతర కీలక నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ, అదానీ జోడీ.. దేశ ప్రజలారా ఇకనైన కళ్లు తెరవండి అన్న ప్లకార్డును రేవంత్ రెడ్డి పట్టుకున్నారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు