Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల మీట్ మామూలుగా లేదు. ప్రతీజిల్లాలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. టీడీపీ, జనసేన పొత్తులోకి బీజేపీ రావడంతో అనంతపురంలో ఒక్కసారిగా రాజకీయ సమీకరణలు మారాయి. ఇక్కడ సీటు ఎవ్వరికి ఇవ్వాలే దాని మీద తెగ చర్చ జరుగుతోంది.

New Update
Andhra Pradesh : ఎన్నికల వేళ రసవత్తరంగా అనంతపురం రాజకీయాలు

Anantapur : అనంతపురం రాజకీయం(Anantapur Politics) గా మంచి హీట్ మీద ఉంది. ఇప్పటి వరకు ఒక లెక్క బీజేపీ(BJP) రాకతో మరొక లెక్క అన్నట్టు తయారైంది. పొత్తుల్లో భాగంగా అనంతపురం టికెట్ ఎవరికి దక్కుతుందనేది తెలియడం లేదు. దీని మీద తెగ చర్చ జరుగుతోంది. అనంతపురం అర్బన్‌, దర్శి నియోజకవర్గాలు టీడీపీ(TDP) కే దక్కుతాయని అనుకుంటున్నారు. అధిష్టానం పిలుపుతో అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి(Prabhakar Chowdary) విజయవాడకు బయలుదేరి వెళ్ళారు. దీంతో ఇక్కడ టికెట్ టీడీపీకే ఇస్తారని కన్షామ్ చేసుకుంటున్నారు.

దీని తర్వాత గుంతకల్లుపైనా రకరకాల ఊహాగానాలు ప్రచారం అవుతున్నాయి. గుంతకల్లు సీటును గుమ్మనూరు జయరాంకు కేటాయిస్తారని బాగా ప్రచారం జరుగుతోంది. తుమ్మనూరు కూడా ఇదే ఆశతో వైసీపీ(YCP) నుంచి వచ్చేశారు. వైసీపీలో ఈసారి గుమ్మనూరుకు ఎంపీ టికెట్ ఇస్తామన్నారు. అయితే జయరాం తాను కేవలం ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానంటూ పార్టీ నుంచి బయటకు వచ్చేసి టీడీపీలో జాయిన్ అయ్యారు. అందుకే ఇప్పుగడు గుంతకల్లు సీటు కచ్చితంగా గుమ్మనూరు జయరాంకే ఇస్తారని అంటున్నారు.

ఈ రెండు టికెట్ల విషయమై కాసేపట్లో మాజీ ఎమ్మెల్యేలు ప్రభాకర్‌ చౌదరి, జితేంద్రగౌడ్‌..టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టికెట్‌ విషయంపై ఇద్దరు నేతలతో చంద్రబాబు చర్చలు చేయనున్నారు. అనంతపురం అర్బన్‌ టికెట్‌ను టీడీపీకి కేటాయిస్తే జనసేన పరిస్థితి ఏంటి? జనసేన నేతలు ఎలా రియాక్ట్‌ అయ్యే అవకాశముంది? జనసేన తరపున టికెట్‌ ఆశిస్తున్న వారిని ఎలా బుజ్జగిస్తారు? అనే విషయాల మీద కూడా చంద్రబాబు నేతలతో చర్చించనున్నారు.

Also Read : JOBS : ఐటీడీసీలో ఉద్యోగాలు..6 లక్షల వరకు జీతం

Advertisment
తాజా కథనాలు