స్టోరీ విషయంలో గోప్యత
ఇంతవరకు గుంటూరు కారం మూవీ నుంచి రిలీజయిన ప్రమోషనల్ కంటెంట్కు ట్రెమండస్ రెస్పాన్స్ రావడంతో ఈ సంక్రాంతికి గట్టిగానే వసూళ్లు సాధిస్తుందని కాన్ఫిడెన్స్ గా ఉన్నారు మేకర్స్. అయితే .. ఈ మూవీలో మహేష్ బాబు పాత్ర మాసీగా ఉంటుందని తెలుస్తోంది కానీ ..ఈ మూవీ స్టోరీ ఏంటి ?హీరో ఏం చేస్తుంటాడు? అనే విషయాల్ని చిత్ర బృందం చాలా గోప్యoగా ఉంచారు.
గుంటూరు కారం సినిమాకు మొదట అనుకున్న టైటిల్ ఏంటో తెలుసా ?
పొలిటికల్ అంశాలతో ముడిపడి ఈ చిత్ర కథ ఉంటుందని తెలుస్తోంది. గుంటూరు మేయర్ రాజకీయాల చుట్టూ ఈ కథ నడుస్తుందట. ఇక.. రమ్యకృష్ణ ఓ కీలక పాత్ర పోషిస్తుండటం విశేషం. ఆమెని మేయర్ చేసే బాధ్యత మహేష్ పై పడుతుందట. ఆ ప్రయాణంలో ఎదురయ్యే అవాంతరాలు, ఆటంకాల నేపథ్యంలో సినిమా సాగుతుందని సమాచారం. ఈ చిత్రం కోసం ‘అమరావతికి అటూ ఇటూ’ అనే టైటిల్ అనుకొన్నారు. ఆ టైటిల్ మరీ క్లాస్ అయిపోయిందని భావించిన ‘గుంటూరు కారం’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ – మహేష్‌ల మధ్య సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుబతాయని తెలుస్తోంది. పాటలూ, మహేష్ గెటప్, టైటిల్ ఇవన్నీ మాసీగా ఉన్నా, ఆ సన్నివేశాలు మాత్రం కుటుంబ ప్రేక్షకులకు నచ్చుతాయని సమాచారం.ఒకవేళ ఈ మూవీలో పొలిటికల్ అంశాలు కానీ ఉంటె ఈ సినిమా జనవరి 13న ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి మరి.
ALSO READ :Sivaji:మెగా ఫ్యామిలీపై శివాజీ ఆసక్తికర వ్యాఖ్యలు!!