ప్రముఖ రాజకీయ వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్.. కొత్త పార్టీని ప్రారంభించనున్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన జన్ సురాజ్ ప్రచారంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్ 2న తన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్ కిషోర్ తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. 'బీహార్ ప్రజలు జేడీయూ, బీజేపీ, ఆర్జేపీ పార్టీలతో విసిగిపోయారు. అక్టోబర్ 2న పార్టీ ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున తరలివస్తారు.
Also Read: స్కిల్ యూనివర్సిటీ ఛైర్మన్‌గా ఆనంద్ మహీంద్రా !
నేను మాత్రమే కొత్త పార్టీని ఏర్పాటు చేయడం లేదు. కోటీ మంది బీహార్ ప్రజలు కలిసి ఈ పార్టీని స్థాపించనున్నారు. 30 ఏళ్లుగా లాలు ప్రసాద్, నితీశ్ కుమార్, బీజేపీ కొనసాగిస్తు్న్న పాలన నుంచి విముక్తి నుంచి పొంది తమ పిల్లలకు మంచి భవిష్యత్తును ఇవ్వాలనే లక్ష్యంతో ఈ పార్టీని ఏర్పాటుచేయనున్నారు. ఒక పార్టీని స్థాపించేందుకు బీహార్ ప్రజలు కలిసి రావడం ఇదే మొదటిసారి' అని ప్రశాంత్ కిషోర్ తెలిపారు.
Also Read: కేజ్రీవాల్ కు ఊహించని షాక్..