Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్..ఉదయం తొమ్మిదికే 10శాతం దాటిన ఓటింగ్

ఏపీ, తెలంగాణల్లో పోలింగ్ మొదలై ఇప్పటికి మూడు గంటలు గడుస్తోంది. ఉదయం నుంచి జనాలు క్యూల్లో బారులు తీరి మరీ ఓటేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం...తెలంగాణలో 9.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది.

New Update
Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో జోరుగా పోలింగ్..ఉదయం తొమ్మిదికే 10శాతం దాటిన ఓటింగ్

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఓటింగ్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. సామాస్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఓటు వేసేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు. ఉదయం ఏడు గంటల నుంచే క్యూల్లో నిలబడి ఓటేస్తున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులు, రాజకీయ నేతలు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ ఈవీఎంలు మొరాయిస్తున్నప్పటికీ జాలు ఓపిగ్గా క్యూలో నిల్చుని ఓటేసి వెళుతున్నారు.

తెలంగాణలో ఉదయం తొమ్మది గంటల వరకు 9.51 శాతం ఓటింగ్ నమోదయ్యింది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో 10 శాతం నమోదయింది. ఏపీలో అత్యధికంగా కడపలో 12.09తం ఓటింగ్ నమోదయింది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఈవీఎంలలో ఫోటోలు కినిపంచకపోవడంతో అక్కడ ఓటింగ్ ప్రక్రియ ఆలస్యంగా మొదలయింది. దీంతో ఇప్పటివరకు అక్కడ కేవలం 10 శాతం మాత్రమే ఓటింగ్ నమోదయినట్లు తెలుస్తోంది. కోనసీమలో 10.42, తూర్పు గోదావరి జిల్లాలో 8.68, ఏలూరులో 9.90, గుంటూరులో 6.17, కాకినాడ 7.95, కృష్ణా 10.80, పల్నాడు 8.53, పార్వతీపురం 6.30, ప్రకాశం 9.84, కర్నూలు 9.34, నంద్యాల 10.32, ఎన్టీయార్ 8.95, నెల్లూరు 9.51, శ్రీ సత్యసాయి 6.92, శ్రీకాకుళం 8.30, విశాఖ 10.24, విజయనగరం 8.77, ప.గో 9.57, కడప 12.09, తిరుపతిల్లో 8.11, అల్లూరి 6.77, అనకాపల్లి 8.37, అనంతపురం 9.18, అన్నమ్య్ 9.89, బాపట్ల 11.36, చిత్తూరు 11.84 శాతం పోలింగ్ నమదయ్యింది. ఇక్కడ అత్యధికంగా కడపలో 12. 38 వాతం నమోదవ్వగా...అత్యల్పంగా పార్వతీపురంలో 6.30 ఓటింగ్ నమోదయింది.

ఇక తెలంగాణలో ఆదిలాబాద్-13.2, జహీరాబాద్-12.8, నల్గొండ-12.8, భువనగిరి 10.54, చేవెళ్ళ 8.29, కరీంనగర్ 10.23, ఖమ్మం 12.24, మహబూబాబాద్ 11.94, మహబూబ్‌నగర్ 10.33, పెద్దపల్లి 9.53, మల్కాజిగిరి 6.20, మెదక్ 10.99, నాగర్ కర్నూల్ 9.81, నిజామాబాద్ 10.91, సికింద్రాబాద్ కంటోన్మెంట్ 6.28, హైదరాబాద్ 5.06, సికింద్రాబాద్ 5.40, వరంగల్ 8.97 శాతం పోలింగ్ నమోదయింది. ఎప్పటిలానే హైదరాబాద్‌లో అతి తక్కువ పోలింగ్ శాతంతో మందకొడిగా ఉంది.

Also Read:Elections 2024: మొరాయిస్తున్న ఈవీఎంలు..చాలాచోట్ల ఓటింగ్ ప్రక్రియ ఆలస్యం

Advertisment
Advertisment
తాజా కథనాలు