Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. వారాహి యాత్రను అడ్డుకున్న పోలీసులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు పోలీసులు షాకిచ్చారు.వారాహి ప్రచారానికి పవన్ అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద వారాహి పూజలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అయితే జనసేన నేతలు వారాహి స్థానంలో మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు.

New Update
Pawan Kalyan: పవన్‌ కల్యాణ్‌కు షాక్‌.. వారాహి యాత్రను అడ్డుకున్న పోలీసులు

Pawan Varahi Yatra Stopped By Police: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. పీఠాపురం నుంచి ఆయన చేపట్టనున్న వారాహి ప్రచారానికి అనుమతులు తీసుకోకపోవడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పిఠాపురం పాదగయ క్షేత్రం వద్ద వారాహి పూజలు కూడా క్యాన్సిల్ అయ్యాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయడానికి పవన్ కల్యాణ్ అనుమతి తీసుకోలేదని.. పోలీసులు తెలిపారు. కానీ చేబ్రోలులో జనసేన బహిరంగ సభకు మాత్రం పోలీసులు అనుమతిచ్చారు.దీంతో జనసేన నేతలు వారాహి స్థానంలో మరో వాహనాన్ని ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో చేబ్రోలులో.. పవన్‌ ప్రచార సభ ప్రారంభం కానుంది.

Also Read: షర్మిల ధర్నా .. విజయవాడలో హై టెన్షన్.. లైవ్

Advertisment
తాజా కథనాలు