Drugs : దేశంలో డ్రగ్స్(Drugs), గంజాయి(Ganja) విచ్చలవిడిగా చలామని అవుతున్నాయి. పోలీసు అధికారులు ఎన్ని కఠిన చర్యలు చేపట్టినా మత్తు మాయగాళ్లు కంట్రోల్ కావట్లేదు. డ్రగ్స్ వ్యాపారులు, వినియోగదారులు వివిధ మార్గాల్లో తమకు కావాల్సిన సరుకు సరాఫరా చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ రాష్ట్రంలో చేపల పడవలో రహస్యంగా తరలిస్తున్న హెరాయిన్ పట్టుబడింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
రూ.350 కోట్లకు పైగానే..
ఈ మేరకు గుజరాత్(Gujarat) సరిహద్దు ప్రాంతంలో చేసే సాధారణ తనిఖీల్లో భాగంగా పోలీసులు శుక్రవారం రాత్రి సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలోనే గుజరాత్‌లోని గిర్ సోమ్‌నాథ్ జిల్లాలో ఓ చేపల పడవలో 50 కిలోలకు పైగా హెరాయిన్‌ను గుజరాత్ పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీని విలువ సుమారు రూ.350 కోట్లకుపైగా ఉంటుందని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘవి వెల్లడించారు.
ఇది కూడా చదవండి : Nalgonda : పోలీసుల ప్రాణాలమీదకొచ్చిన గొర్రెల పంచాయితీ..ఎస్‌ఐపై దాడి!
అదుపులో ముగ్గురు మహిళలు..
అలాగే భారత్-నేపాల్(India-Nepal) సరిహద్దులోనూ చేపట్టిన ఆపరేషన్ లో వందకిలోలకు పైగా మాదక ద్రవ్యాలు పట్టుబడ్డాయి. ఉత్తర్‌ప్రదేశ్(Uttar Pradesh) లో రాష్ట్ర సరిహద్దు ప్రాంతం సోనౌలిలో రెండు వేర్వేరు ఘటనల్లో నలుగురు వ్యక్తుల దగ్గర నుంచి 110 కిలోల మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. అందులో ముగ్గురు మహిళలు 39 కిలోల డ్రగ్స్ సరాఫరా చేస్తున్నట్లు గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.