Telangana:హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసులకు భారీగా దొరికిన గంజాయి

సైబరాబాద్‌ పరిధిలో మళ్లీ డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. SOT పోలీసులు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. డ్రగ్స్‌తో దొరికిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి విచారిస్తున్నారు. 

New Update
Telangana:హైదరాబాద్‌లో మళ్లీ డ్రగ్స్ కలకలం.. పోలీసులకు భారీగా దొరికిన గంజాయి

తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయాలని ఓ వైపు ప్రభుత్వం, పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. మరోవైపు అక్రమంగా డ్రగ్స్‌ దందా జరుగుతూనే ఉంది. తాజాగా సైబరాబాద్‌ పరిధిలో మళ్లీ డ్రగ్స్‌ పట్టుబడటం కలకలం రేపింది. SOT పోలీసులు కిలో హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటివిలువ ఏకంగా రూ.10 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

Also Read:  రేషన్‌ కార్డు లేనివారికి గుడ్‌న్యూస్‌..

డ్రగ్స్‌తో దొరికిన నలుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఆరా తీస్తున్నారు. సైబరాబాద్‌ సీపీ అవినాష్ మహంతి ఈ ఘటనపై స్వయంగా రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు.

Also read: హైదరాబాద్ వాసులకు రేవంత్ శుభవార్త.. మూసీ అభివృద్ధికి ఎన్ని వేల కోట్లంటే?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు