Hyderabad : ‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మంది స్టేషన్‌కు తరలింపు

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 14లో రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని 'ఆఫ్టర్‌ నైన్‌' పబ్‌పై పోలీసులు దాడులు చేశారు. 160 మందిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

New Update
Hyderabad : ‘ఆఫ్టర్‌ 9’ పబ్‌పై దాడి.. 160 మంది స్టేషన్‌కు తరలింపు

After9 : హైదరాబాద్‌(Hyderabad) లోని బంజారాహిల్స్‌ రోడ్డు నెంబర్ 14లో 'ఆఫ్టర్‌ నైన్‌' పబ్‌(After9 Pub) పై శనివారం అర్ధరాత్రి తర్వాత పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. రూల్స్‌కు విరుద్ధంగా సమయం దాటిన తర్వాత కూడా పబ్‌ను నిర్వహిస్తున్నారని అందుకే రైడ్స్ చేశామని తెలిపారు. కస్టమర్లను ఆకర్షించేందుకు.. నిర్వాహకులు పలు రాష్ట్రాలకు చెందిన 40 మంది యువతులతో అసభ్యకరమైన నృత్యాలు చేయిస్తున్నారని చెప్పారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు(Banjara Hills Police) ఆఫ్టర్ నైన్ పబ్‌పై కేసు నమోదు చేశారు.

Also Read: ఇవాళ తెలంగాణకు రానున్న రాహుల్ గాంధీ, అమిత్ షా

మొత్తం 160 మంది యువతీ, యువకులను అదుపులోకి స్టేషన్‌కు తరలించారు. వీళ్లందరికీ 41ఏ సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసి వివరాలు సేకరించారు. యువతులను మహిళా పునరావాస కేంద్రానికి తరలిస్తామని చెప్పారు. అలాగే పబ్‌లో నిషేధిత మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: రైతుబంధుపై మాటల యుద్ధం.. రేవంత్‌ VS బీఆర్ఎస్

Advertisment
తాజా కథనాలు