Tukkuguda : తుక్కుగూడ సభకు పోలీసులు అనుమతి..పదివేల మంది దాటకూడదని కండీషన్..!! తెలంగాణ కాంగ్రెస్ విజయభేరీ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. సెప్టెంబర్ 17న హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో విజయభేరి పేరుతో భారీ బహిరంగసభను నిర్వహించేందుకు తెలంగాణ కాంగ్రెస్ సిద్ధమైంది. మొదట్లో ఈ సభకు దేవాదాయ శాఖ నుంచి అభ్యంతరం వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో తాజాగా పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వడంతో సభను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. By Bhoomi 14 Sep 2023 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17వ తేదీన భారీ బహిరంగసభను నిర్వహించేందుకు రెడీ అయ్యింది. ఈ సభను హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో నిర్వహించాలని ప్లాన్ చేసింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ను చేస్తోంది ఆపార్టీ. కాంగ్రెస్ అగ్రనేతలు అయిన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఈ సభకు హాజరుకానున్న నేపథ్యంలో ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీపీసీసీ. 10లక్షల మంది జనసమీకరణ చేయాలని భావిస్తోంది. అటు పోలీసులు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకున్నా సభను నిర్వహించి తీరుతామని టీపీసీసీ వర్గాలు వెల్లడించాయి. ఇది కూడా చదవండి: నేడు మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ…భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..!! అయితే తాజాగా ఈ సభకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. అయితే కొన్ని షరతులు విధించారు. సభకు వచ్చే వారికి సంఖ్య 10వేలకు మించకూడదని..సాయంత్రం 4గంటల నుంచి రాత్రి 9గంటల వరకు మాత్రమే సభ నిర్వహించాలన్న షరతు పెట్టారు. అయితే ఈ షరతులు తుక్కుగూడలో భారీ బహిరంగసభ నిర్వహించాలన్న కాంగ్రెస్ ఆశలపై నీళ్లు చల్లేలా విధంగా కనిపిస్తున్నాయి. అటు తుక్కుగూడులో కాంగ్రెస్ సభకు పర్మిషన్ ఇచ్చిన రాచకొండ పోలీసులు విధించిన షరతులను చూసినట్లయితే... 1. ప్రొఫెషనల్ ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నిమగ్నమయ్యేలా చూడాలి. 2. ఒకే బాక్స్ స్పీకర్ ను ఉపయోగించాలి. 3. 55 డీబీ కంటే తక్కువ శబ్ధం ఉండాలి. 4. డ్రోన్లు వినియోగించరాదు. 5. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. 6. రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేయకూడదు. 7. నిర్వాహకులు డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్లు ఏర్పాటు చేయాల్సిందే. 8. హాట్ ఎయిర్ బెలూన్స్ పై నిషేధం. ఇది కూడా చదవండి: దేశంకోసం ప్రాణాలు వదిలిన ఈ డీఎస్పీ కథ వింటే ఖచ్చితంగా సెల్యూట్ చేస్తారు..! పోలీసులు పెట్టిన ఈ కండీషన్లపై కాంగ్రెస్ నాయకులు ఫైర్ అవుతున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన బీజేపీ మీటింగ్ కు , పబ్లిక్ గార్డెన్స్ లో జరిగే బీఆర్ఎస్ మీటింగ్ కు ఇలాంటి షరతులు విధించారా అంటూ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. పోలీసులు విధించిన ఈ కండిషన్స్ హాస్యాస్పదంగా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #congress #telangana-congress #tpcc #tukkuguda #september-17 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి