MRO Murder Case: ఎమ్మార్వో రమణ హత్య కేసులో కీలక అప్డేట్‌

MR0 రమణ హత్యకు గల కారణాన్ని గుర్తించారు పోలీసులు. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పేర్కొన్నారు. ల్యాండ్‌ అంశంలో ఎమ్మార్వో రమణ, రియల్టర్‌ గంగారాం మధ్య డీల్‌ జరిగిందని.. ఎమ్మార్వో వేరే ప్రాంతానికి బదిలీ కావడంతో ఇద్దరి మధ్య గొడవగా మారి హత్యకు దారి తీసిందని అన్నారు.

New Update
MRO Murder Case: ఎమ్మార్వో రమణ హత్య కేసులో కీలక అప్డేట్‌

MRO Murder Case: ఎమ్మార్వో రమణ (MRO Ramana Murder) హత్య కేసులో కీలక అప్డేట్‌ ఇచ్చారు. హత్యకు గల కారణాన్ని కనుగొన్నారు. ఆర్థిక  లావాదేవీలే రమణ హత్యకు కారణంగా గుర్తించారు పోలీసులు. రుషికొండ (Rushikonda) జ్యువెల్‌ అపార్ట్‌మెంట్స్‌ ల్యాండ్‌ అంశంలో ఎమ్మార్వో రమణ, రియల్టర్‌ గంగారాం (Gangaram) మధ్య డీల్‌ జరిగినట్లు తెలిపారు. డీల్‌ ప్రకారం పనులు పూర్తి కాకుండానే విజయనగరానికి ఎమ్మార్వో రమణ బదిలీ కావడంతో రమణను బెదిరించి పనులు చేయించుకోవాలని గంగారాం అనుకున్నట్లు తెలిపారు.

ALSO READ: నన్ను చంపాలని చూశారు.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

డ్రైవర్‌ ద్వారా ఎమ్మార్వో రమణ విశాఖకు వస్తున్నట్లు తెలుసుకున్నాడు గంగారాం. ప్లాన్‌ ప్రకారం ఇనుపరాడ్‌తో ఎమ్మార్వో రమణ వద్దకు వెళ్లిన గంగారాం.. డీల్‌ అంశంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రాడ్‌తో కొట్టి ఎమ్మార్వో రమణను హత్య గంగారాం చేశాడు. హత్య తర్వాత పరారీలో ఉన్నాడు నిందితుడు. గంగారాం కోసం బెంగుళూరు, చెన్నైలో పోలీసుల సెర్చ్‌ ఆపరేషన్‌ మొదలు పెట్టారు. గంగారాం నాలుగు సిమ్‌కార్డులు వాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు.

విశాఖలో కలకలం...

విశాఖపట్నం కొమ్మాదిలో దారుణం జరిగింది. ఎమ్మార్వో రమణయ్య హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని కొందరు వ్యక్తులు చరణ్ క్యాసిల్‌లో ఉంటున్న రమణయ్య ఇంట్లోకి చొరబడి దాడి చేశారు.  ఐరన్ రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. వాచ్ మెన్ కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయారు. తరువాత రమణయ్యను ఆసుపత్రికి తరలించారు కుటుంబసభ్యులు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ మరణించారు.

నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..

సీసీ టీవీ కెమెరాలు, వాచ్‌మ్యాన్ సాక్ష్యం ఆధారంగా పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ మణికంఠ ఆధ్వర్యంలో  అనుమానితులను విచారణ చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగానే దర్యాప్తును కొనసాగిస్తున్నారు. అయితే ఇంకా ఇనుప రాడ్‌తో కొట్టిన గంగారాం అనే వ్యక్తి మాత్రం దొరకలేదు. అతని గురించి పోలీసులు జల్లెడ పడుతున్నారు. మొత్తం 12 టీమ్స్‌ని వెతకడానికి ఏర్పాటు చేసారు విశాఖ సీపీ రవి శంకర్.

ALSO READ: రేపటి నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

DO WATCH:

Advertisment
Advertisment
తాజా కథనాలు