Farmers Protest:ఢిల్లీ బోర్డర్‌లో రైతులు పట్టువదలడం లేదు. ఛలో ఢిల్లీ నిరసనను రాజధానిలో చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నిన్న మొదలుపెట్టిన ఈ ఆందోళన ఇవాళ రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు శంభు సరిహద్దులో రైతులు ఢిల్లీలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించటగా పోలీసులు వారి మీద టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనలో 60 మంది రైతులు గాయపడ్డారని సమాచారం. పంజాబ్, హర్యానాకు చెందిన రైతులు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను పగులగొట్టడానికి ప్రయత్నించడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Also Read:Telanagana:రారా చూసుకుందాం.. కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
మావైపు వస్తే ఊరుకునేది లేదు..
మరోవైపు నిరసనకారులపై టియర్ గ్యాస్ వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడం మీద ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు పటియాలా డిప్యూటీ కమిషనర్ (DC) షౌకత్ అహ్మద్.. అంబాలా డీసీకి లేఖ రాశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని తేల్చి చెప్పారు.
భారీగా ట్రాఫిక్ జామ్...
ఢిల్లీ చలో'(Delhi Chalo) పాదయాత్ర రెండో రోజు కారణంగా నగరంలో భారీ ట్రాఫిక్ సమస్య(Traffic Jam) ఏర్పడింది. దీంతో ఢిల్లీ(Delhi) లోని వివిధ ప్రాంతాలలో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ నుంచి బయటకు వెళ్లేందుకు లోని, ఔచండి, జోంటి, పియావు మనియారి, సఫియాబాద్ ట్రాన్సిట్ పాయింట్లను ఉపయోగించాలని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు.ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్‌లోని ట్రాఫిక్ పోలీసులు ఏదైనా ఇబ్బందులు ఎదురైతే సహాయం కోసం యాణీకుల కోసం హెల్ప్‌లైన్ నంబర్‌లను – 1095, 9971009001, 9643322904 జారీ చేశారు.
మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం...
ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేస్తున్న రైతులను కేంద్రం మరోసారి చర్చలకు పిలిచింది. రాజకీయ పార్టీలతో కలిసి తప్పుడు దారిలో వెళ్ళొద్దని..చర్చించుకుని సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించింది మోడీ గవర్నమెంట్.