Raja Singh: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు!

గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై కేసు నమోదైంది . ఇటీవల ఖానాపూర్‌లో ఎన్నికల ప్రచారం చేస్తూ.. సమయం ముగినప్పటికీ ఇంకా ప్రచారం చేయడంతో ఆయనతో పాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Raja Singh: రాజాసింగ్‌పై మరో కేసు.. ఎన్నికల వేళ షాకిచ్చిన పోలీసులు!
New Update

Case Filed Against MLA Raja Singh: గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రచార సమయం మగిసినప్పటికీ ప్రచారాన్ని (Election Campaign) కొనసాగించిన కారణంగా ఆయనపై కేసు నమోదైంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో (Khanapur) రాజాసింగ్ ఎన్నికల ప్రచారం చేశారు. అయితే ఆయన ఎన్నికల ప్రచార ర్యాలీకి ఎన్నికల రిటర్నింగ్ అధికారి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఇచ్చారు. దీంతో ఓ అధికారి రాజాసింగ్ ఆరోజున సమయం ముగిసినప్పటికీ సాయంత్రం 7 గంటల వరకు ప్రచారం చేశారని ఫిర్యాదు చేశారు.

Also Read: ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ.. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన TSRTC

దీంతో ఆయన ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేశామని ఎస్సై జి.లింబాద్రి తెలిపారు. ఏ1 గోడం నగేష్, ఏ2 రాజాసింగ్, ఎ3 పాయల్ శంకర్, ఏ4 అంకం మహేందర్‌తో పాటు మరికొందరిపైన కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Also Read: మరో నాలుగు రోజులు వానలే వానలు..

#telugu-news #bjp #lok-sabha-elections-2024 #mla-raja-singh #election-rally
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe