Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు ముమ్మరం

మల్లారెడ్డి భూ వివాదంపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు.

New Update
Malla Reddy : మల్లారెడ్డి భూ వివాదంపై దర్యాప్తు ముమ్మరం

Malla Reddy Land Dispute : మల్లారెడ్డి భూ వివాదం (Land Dispute) పై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. సుచిత్రలోని వివాద స్థలానికి వెళ్లిన రెవెన్యూ అధికారులు (Revenue Officers).. సర్వే నంబర్ 82లో ల్యాండ్ సర్వే చేస్తున్నారు. ఇప్పటికే ఆ వివాద స్థలంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎవరినీ అటువైపు వెళ్లకుండా అనుమతించడం లేదు. మీడియాకు కూడా పర్మిషన్ ఇవ్వడం లేదు. ల్యాండ్ సర్వేతో వివాదం కొలిక్కి రానుంది. అయితే 11 ఏళ్ల క్రితమే ఆ భూమిని కొన్నానని మల్లారెడ్డి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన డాక్యుమెంట్లతో ల్యాండ్‌ వద్దకు వచ్చారు.

Also read: అలర్ట్.. ఈ నెల 25 వరకు వర్షాలు

ఇదిలాఉండగా.. మాజీ మంత్రి మల్లారెడ్డి, ఇతర నేతలకు మధ్య సర్వే నంబర్‌లో భూవివాదం చోటుచేసుకుంది. తన భూమిని కబ్జా చేస్తున్నారని.. మల్లారెడ్డి, ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ చుట్టూ అక్రమంగా కంచె వేశారని.. దానిని తొలగించాలంటూ తమ అనుచరులకు ఆదేశించారు. దీంతో ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.

తమ భూమిలో ఫెన్సింగ్ వేస్తే.. చూస్తూ ఎలా ఉరుకున్నారంటూ మల్లారెడ్డి పోలీసులతో వాదించారు. కేసు పెడితే పెట్టుకోండి.. నా స్థలాన్ని నేను కాపాడుకుంటానని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ఉండగానే మల్లారెడ్డి (Malla Reddy) అనుచరులు ల్యాండ్ చుట్టు ఉన్న ఫెన్సింగ్‌ను కూల్చివేశారు. ఆ తర్వాత పోలీసులు మల్లారెడ్డి, రాజశేఖర్‌ రెడ్డిని అదుపులోకి తీసుకోని పేట్‌బషీర్‌బాద్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. గతంలో ఈ భూమి తమదేనంటూ 15 మంది వచ్చారు. అందరం 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామని తెలిపారు. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పునిచ్చిందని తెలిపారు. అయితే స్థల వివాదంపై కోర్టు ఆర్టర్స్ ఉన్నందువల్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరువర్గాలకు పోలీసులు సూచించారు.

Also read: గుడ్‌న్యూస్.. కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ నిధులు విడుదల

Advertisment
తాజా కథనాలు