Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు

జగన్‌పై రాయి దాడి కేసులో కొత్త ట్విస్ట్‌ చోటుచేసుకుంది. టీడీపీ నేత బోండా ఉమ అనుచరులే...జగన్‌పై దాడి చేశారనే ప్రచారం జరుగుతోంది. బోండా అనుచరుడు దుర్గారావు దాడి చేయించారని చెబుతున్నారు.

New Update
Andhra Pradesh: జగన్ కేసులో కొత్త ట్విస్ట్..బోండా ఉమపై అనుమానాలు

CM Jagan Attack Case: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం సీఎం జగన్‌ మీద రాయి దాడి సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు.ఈ కేసులో ఏ1గా రాయితో దాడి చేసిన సతీష్, ఏ2గా దుర్గారావు పై కేసు నమోదైంది. దుర్గారావు చెబితేనే సతీష్ అనే వ్యక్తి దాడి చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. సిమెంట్ రాయి ముక్కతో బస్సుకు 20 అడుగుల దూరంలో ఉన్న వివేకానంద స్కూల్ పక్కన రోడ్డు నుంచి సతీష్ దాడి చేసినట్లు తెలిసింది. దాడి తర్వాత సతీష్, దుర్గారావు వారివారి ఇళ్ళకు వెళ్ళిపోయారు. ఈరోజు దుర్గారావు, సతఈష్‌లను పోలీసులు అరెస్ట్ చేయనున్నారు. ఇక అంతకు ముందు అదుపులోకి తీసుకున్న నలుగురు అనుమానితుల దగ్గర నుంచి స్టేట్‌మెంట్‌ తీసుకుని పోలీసులు వారిని విడుదల చేయనున్నారు.

టీడీపీ నేతవైపు తిరిగిన కేసు

దాడి చేసింది దుర్గారావు, సతీష్ అని తేల్చారు. అయితే ఈ దాడి వెనుక టీడీపీ నేత బోండా ఉమ హస్తం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. దుర్గారావు అనే వ్యక్తి బోండా ఉమ అనుచరుడేనని అంటున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలో దుర్గారావు యాక్టివ్‌గా ఉన్నట్టు పోలీసులు కూడా గుర్తించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న బోండా ఉమ వెంటనే రియాక్ట్ అయ్యారు. దాడికి , తనకూ ఏం సంబంధం లేదని చెప్పారు. పోలీసులు కావాలనే తనని ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు బోండా. దుర్గారావు తనకు ప్రతిరోజూ ఫోన్ చేసి కార్యక్రమాల షెడ్యూల్ చెప్తారని, కావాలంటే ఈ విషయం ఫోన్ రికార్డుల ద్వారా చూసుకోవచ్చన్నారు. అన్యాయంగా తనను ఇరికిస్తే మాత్రం జూన్ 4 తర్వాత ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరిస్తున్నారు బోండా ఉమ.

Also Read:Dubai: దుబాయ్‌లో కుంభవృష్టికి కారణం క్లౌడ్ సీడింగేనా?

Advertisment
తాజా కథనాలు